హాజరైన ఈజిప్ట్ అధ్యక్షుడు, ప్రధాని నరేంద్ర మోడీ
న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ లో గురువారం 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా
జరిగాయి. రాజ్‌పథ్ పేరు మార్చి ఆధునీకరించిన తర్వాత తొలిసారి గణతంత్ర వేడుకలకు
కర్తవ్య పథ్ వేదికైంది. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి
కర్తవ్యపథ్‌లో ద్రౌపదీ ముర్ము త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. ఈజిప్టు
అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సీసీ రిపబ్లిక్‌డే వేడుకల్లో ముఖ్యఅతిథిగా
పాల్గొన్నారు.