దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ కొత్త కారును భారత మార్కెట్లో
ప్రవేశపెట్టింది. గతంలో తీసుకువచ్చిన ఆరా మోడల్ కు ఇది ఫేస్ లిఫ్ట్ వెర్షన్.
పాత ఆరాతో పోల్చితే దీంట్లో ప్రధానంగా ఫ్రంట్ గ్రిల్ లో మార్పు చేశారు.
కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో తీసుకువచ్చిన ఈ కారు ఎంట్రీ లెవల్ మోడల్ ధర
రూ.6.29 లక్షలు కాగా, హై ఎండ్ వెర్షన్ ధర రూ.8.87 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్
షోరూం ధరలు. ఇందులో ఆరా-ఈ, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ ప్లస్, ఎస్ఎక్స్(ఓ)
వేరియంట్లు ఉన్నాయి. ఆరా కొత్త వెర్షన్ బుకింగ్ లు గత నెలలోనే
ప్రారంభమయ్యాయి. రూ.11 వేలు అడ్వాన్స్ పేమెంట్ తో బుక్ చేసుకోవచ్చు. ఇది
విభిన్న రంగుల్లో లభ్యవుతుంది.
కొత్త ఆరా ప్రత్యేకతలు
1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజిన్/1.2 లీటర్ బైఫ్యూయల్ ఇంజిన్ (గ్యాస్,
పెట్రోల్)
5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్/ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్
6 ఎయిర్ బ్యాగ్ లు
టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్
బర్గలర్ అలారం
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ మేనేజ్
మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వ్యవస్థ
ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్
పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ క్రూయిజ్ కంట్రోల్ తో కూడిన స్మార్ట్ కీ
వైర్ లెస్ ఫోన్ చార్జర్
టైప్-సి ఫాస్ట్ యూఎస్ బీ చార్జర్
8 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్
ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ
3.5 అంగుళాల ఎంఐడీ సహిత స్పీడోమీటర్
ఫుట్ వెల్ లైటింగ్