బెంగళూరు : గత ప్రభుత్వాలు నీరు, విద్యుత్తు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలకు
ఖర్చు చేసే సందర్భాలను ఓటు బ్యాంకు రాజకీయాలుగా వినియోగించుకున్నా తాము అందుకు
భిన్నంగా అభివృద్ధి రాజకీయాలు చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
పేర్కొన్నారు. కర్ణాటక పర్యటనలో భాగంగా కలబురగి, యాదగిరి జిల్లాల్లో పలు
ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ బీజేపీ
జల్జీవన్ మిషన్, నీటిపారుదల, జాతీయ రహదారుల ఉన్నతీకరణలతో వెనుకబడిన
ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం
ద్వారా రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమని కర్ణాటక నిరూపిస్తోందని
కొనియాడారు. కలబురగి జిల్లాలో గిరిజన కుటుంబాలకు ప్రధానమంత్రి మోడీ హక్కు
పత్రాలు అందించారు.యాదగిరిలో నారాయణ ఎడమ కాల్వ విస్తరణ, ఉన్నతీకరణ, సూరత్-చెన్నై హరిత వలయ జాతీయ
రహదారి, 2.3 లక్షల ఇళ్లకు కుళాయి నీరు అందించే జల్జీవన్ మిషన్
ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రధాని చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా
ఐదు జిల్లాలకు చెందిన 51,900 మంది తాండా వాసులకు అందించిన హక్కు పత్రాల
ప్రక్రియకు గిన్నీస్ బుక్లో చోటు దక్కినట్లు కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.
అశోక్ ప్రకటించారు. ఒకే సమయంలో ఇన్ని హక్కు పత్రాలను అందించిన సాధన పత్రాన్ని
రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ
మాట్లాడుతూ గిరిజన సముదాయాలు ఇకపై నిశ్చింతగా ఉండాలి. మీ బిడ్డ దిల్లీలో
ఉన్నారని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, గవర్నర్ థావర్ చంద్
గహ్లోత్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.