న్యూఢిల్లీ : దేశంలో పేదలు, ధనికుల మధ్య అంతరం మరింత పెరిగేందుకు బీజేపీ
విధానాలే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇటీవల విడుదలైన ఆక్స్ఫామ్
ఇంటర్నేషనల్ వార్షిక అసమానత నివేదికను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై
విమర్శలు గుప్పించింది. దేశ ప్రజల్లో ఆర్థిక అసమానతలను భాజపా ప్రభుత్వం
పెంచుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దేశంలో 40శాతం సంపద కేవలం
ఒక్కశాతం మంది సంపన్నుల్లో ఉన్నట్లు ఓ అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదికను
ప్రస్తావించింది. ముఖ్యంగా పేద, ధనికుల మధ్య అంతరం పెరగడానికి భాజపా విధానాలే
కారణమని విమర్శించింది. వీటితో సామాన్య పౌరుడు అగాధంలో మునిగిపోతున్నాడని
కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని
దుయ్యబట్టారు.‘దేశంలో ఒక్క శాతం కలిగిన సంపన్నుల చేతిలో దేశంలోని 40శాతం సంపద కేంద్రీకృతమై
ఉంది. అదే దేశంలో సగం మంది దగ్గర ఉన్నది కేవలం 3శాతం సంపద మాత్రమే. ఈ ఆర్థిక
అసమానతల మధ్య అగాధాన్ని పూడ్చేందుకే భారత్ జోడో యాత్ర’ అని కాంగ్రెస్
అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. కేవలం కొంతమంది ప్రయోజనం కోసమే
భాజపా ప్రభుత్వం పనిచేస్తోందని ట్విటర్లో విమర్శించారు.‘21 మంది కుబేరుల
దగ్గరున్న సంపద దేశంలోని 70కోట్లకుపైగా పౌరుల వద్ద ఉన్న సంపదతో సమానం. నాటి
యూపీఏ ప్రభుత్వం 20కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది. కానీ, ప్రస్తుత
ప్రధానమంత్రి చేపడుతోన్న కార్యక్రమాలతో వారు మళ్లీ పేదరికంలోకి
జారుకుంటున్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజల
గళాన్ని వినిపించేందుకే ఈ భారత్ జోడో యాత్ర’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
ట్వీట్ చేశారు.

దేశంలోని మొత్తం సంపదలో 40శాతం కంటే అధిక సంపద, 1శాతం జనాభాకు సమానమైన కుబేరుల
చేతిలో ఉందని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ తన వార్షిక అసమానత నివేదికలో
వెల్లడించింది. పేదరికంలోని 50శాతం మంది దగ్గరున్న మొత్తం సంపద 3శాతం
మాత్రమేనని తెలిపింది. భారత్లోని అగ్రగామి 10మంది కుబేరుల సంపదపై 5శాతం పన్ను
లేదా 100 మంది కుబేరుల సంపదపై 2.5శాతం పన్ను విధిస్తే వచ్చే మొత్తంతో దేశంలో
విద్యకు దూరమైన పిల్లలందర్నీ తిరిగి పాఠశాలలకు పంపించవచ్చని అభిప్రాయపడింది.
వీటిని ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు
గుప్పించారు.