న్యూఢిల్లీ : ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి.
రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ
సమావేశాలకు తెలంగాణ నుంచి బండి సంజయ్‌తో పాటుగా బీజేపీ నేతలు పాల్గొన్నారు.
కాగా సమావేశాల అనంతరం బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్
మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సంగ్రామ యాత్రను
ప్రత్యేకంగా రెండు సార్లు ప్రశంసించారు. ప్రభుత్వ వేధింపులను తట్టుకొని
పాదయాత్రను కొనసాగిస్తున్న విషయాన్ని అభినందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం
ఖూనీ అయింది. బెంగాల్ తరహాలో హింసాత్మక పాలన జరుగుతోంది. తెలంగాణలో ప్రజలు
మార్పు కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి చేరే అంశంపై నాకు ఎలాంటి సమాచారం
లేదు. మా సిద్ధాంతం నచ్చి పార్టీలోకి వచ్చే వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాము.
మా పార్టీలోకి ఎవరు వచ్చినా, రాకున్నా ప్రజలే పార్టీని అధికారంలోకి
తీసుకువస్తారు అని కామెంట్స్ చేశారు.