నుంచి తప్పించుకున్నారు. ఓ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించేందుకు లిఫ్ట్ ఎక్కిన
అది పనిచేయకపోవడంతో పాటు నాలుగు అంతస్తుల నుంచి కింద పడింది. ఈ ఘటన నుంచి ఆయన
గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.పుణె : మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్
నేత అజిత్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పుణెలోని ఓ ఆసుపత్రిలో ఆయన
ఎక్కిన లిఫ్ట్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు సాంకేతిక సమస్యలతో నాలుగో
అంతస్తు నుంచి కిందపడింది. అయితే ఈ ఘటన నుంచి ఎలాంటి గాయాలు లేకుండా ఆయన
సురక్షితంగా బయటపడగలిగారు. ఓ కార్యక్రమంలో భాగంగా పవార్ ఈ విషయాన్ని
వెల్లడించారు. లిఫ్ట్ కింద పడిన సమయంలో తనతో పాటు ఒక డాక్టర్, ఇద్దరు
సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఇంట్లో తన భార్యకు,
తల్లికి సైతం చెప్పలేదన్నారు. ముందే అందరికి చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్
న్యూస్ అయ్యేదన్నారు. ఈ ఘటన జనవరి 14న జరిగినట్లు చెప్పారు.
పుణె జిల్లాలోని బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పవార్ పాల్గొన్నారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను ఓ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించేందుకు పుణెకు
వెళ్లాను. భవనంలోని మూడో అంతస్తు నుంచి నాలుగో అంతస్తుకు మెట్ల ద్వారా
వెళ్లేందుకు సిద్ధమయ్యాం. అయితే మాతో పాటు 90 ఏళ్ల డాక్టర్ హార్దికర్
ఉండడంతో మేం లిఫ్ట్ ఎక్కాం. ఆ సమయంలో విద్యుత్ పోవడంతో పాటు లిఫ్ట్
ఆగిపోయింది. చిమ్మచీకటి ఆవరించింది. లిఫ్ట్ ఒక్కసారిగా శబ్దం చేస్తూ నాలుగో
అంతస్తు నుంచి కిందపడింది. నాతో పాటు ఉన్న వ్యక్తి లిఫ్ట్ డోర్లను బలవంతంగా
తెరిచి నన్ను బయటకు లాగాడు. ఆ తర్వాత డాక్టర్ను కాపాడాం. నాకు ఎలాంటి గాయాలు
కాలేదు. డాక్టర్ హార్దికర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. నేను అబద్ధం చెప్పడం
లేదు. మాకు ఏమైనా అయ్యింటే ఈ రోజు ఇది శ్రద్ధాంజలి కార్యక్రమంగా ఉండేది. ఈ
విషయం దాచుకోలేకపోతున్నాను. మీరూ నా కుటుంబ సభ్యులే. అందుకే ఈ విషయం మీతో
చెప్పానని అజిత్ పవార్ అన్నారు.