శబరిమలకు విచ్చేసిన లక్షలాది భక్తులు
పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం
మూడుసార్లు కనిపించిన మకర విళక్కు
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయిన శబరిగిరులు
అయ్యప్పస్వామి భక్తులకు పరమపవిత్ర మకరజ్యోతి (మకర విళక్కు) దర్శనమిచ్చింది.
లక్షలాది భక్తులు మకరజ్యోతిని దర్శించి తరించిపోయారు. ఇక్కడి పొన్నంబలమేడు
కొండపై మకర జ్యోతి ప్రత్యక్షం కాగానే స్వామి శరణం.. అయ్యప్ప శరణం, స్వామియే
శరణం అయ్యప్ప నినాదాలతో శబరిమల కొండ మార్మోగిపోయింది. ప్రతి ఏడాది మకర
సంక్రాంతి సందర్భంగా శబరిమల క్షేత్రం వద్ద పొన్నంబలమేడు పర్వతంపై మకరజ్యోతి
మూడు సార్లు దర్శనమిస్తుంది. అయ్యప్ప ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే
పొన్నంబలమేడు కొండ ఉంటుంది. అయ్యప్ప దీక్షలు చేపట్టిన భక్తులు మకరవిళక్కును
దర్శించడాన్ని పుణ్యప్రదంగా భావిస్తారు.