న్యూఢిల్లీ : జైనులు పవిత్రంగా భావించే ఝార్ఖండ్‌లోని ‘సమ్మేద్ శిఖర్జీ’
ప్రదేశం ఉన్న పార్శ్‌నాథ్ కొండపై అన్ని పర్యటక కార్యకలాపాలను
నిలిపివేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రాంతంలో మద్యం, మాంసం
వినియోగం, అమ్మకాలను నిషేధించి, అక్కడి పవిత్రతను కాపాడేందుకు చర్యలు
తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పర్యావరణ సున్నిత ప్రాంతం
(ఈఎస్‌జెడ్)గా ప్రకటించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత నిబంధనలను
తప్పుడు విధానంలో అమలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఈ విషయమై
ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని సంప్రదించామని, తాను స్వయంగా ముఖ్యమంత్రి హేమంత్
సోరెన్‌కు లేఖ రాశానని కేంద్ర పర్యటక మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం
ఉదయం జైన ప్రతినిధులతో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భుపేందర్ యాదవ్
సమావేశమయ్యారు. సమ్మేద్ శిఖర్జీ పవిత్రతను కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి
ఉందని వారికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. అంతకుముందు ఈ
వ్యవహారంపై సరైన నిర్ణయం తీసుకోవాలని సీఎం హేమంత్ సోరెన్ కేంద్రానికి లేఖ
రాశారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం
ప్రతిపాదించడంతో 2019ఆగస్టులో పార్శ్‌నాథ్ కొండను పర్యావరణ సున్నిత ప్రాంతంగా
మార్చి, పర్యటకాన్ని అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దాంతో అక్కడి
పవిత్రతను దెబ్బతీసేలా కార్యకలాపాలు జరుగుతాయని అప్పటి నుంచి జైనులు ఆందోళన
వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సానుకూల
నిర్ణయం తీసుకున్నందుకు వివిధ జైన సంఘాల ప్రతినిధులు ప్రధాని మోడీకి
కృతజ్ఞతలు తెలిపారు.అది మా పవిత్ర ప్రదేశం : గిరిజనులు

మరోవైపు పార్శ్‌నాథ్ కొండపై తమకే పూర్తి హక్కులు ఉన్నాయని గిరిజన సంఘాలు
వెల్లడించాయి. పార్శ్నాథ్ను వీరు మరంగ్ బురుగా వ్యవహరిస్తారు. తమకు
పవిత్రమైన మరంగ్ బురును స్వేచ్ఛాయుత ప్రదేశంగా వదిలివేయాలని వారు
ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కొండపై హక్కులను జైనులు న్యాయపోరాటంలో
ఎప్పుడో కోల్పోయారని, 1956లో వెలువడిన గెజిట్‌లో దీనిని ‘మరంగ్ బురు’ గానే
ప్రస్తావించారని గిరిజన సంఘాలకు నాయకత్వం వహిస్తున్న ప్రపంచ సంతాల్ సంఘం
వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్ ముర్ము తెలిపారు. ప్రభుత్వం తమ
డిమాండ్లకు ఒప్పుకోకపోతే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.