అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తల్లి కన్నుమూశారు. ఇటీవల ఆమె
అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స
అందిస్తున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం తీవ్రం కావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.
ప్రధాని నరేంద్ర మోడీతల్లి హీరాబెన్(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం
ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్స్టిట్యూట్
ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ
చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవలే
ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. మాతృమూర్తి మరణంతో ప్రధాని మోడీ
దిల్లీ నుంచి అహ్మదాబాద్ బయల్దేరారు. మరోవైపు శుక్రవారం తాను పాల్గొనాల్సిన
కార్యక్రమాలన్నింటినీ ఆయన రద్దు చేసుకున్నట్లు సమాచారం. హీరాబెన్ మృతిపై
దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు.