– ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిక
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63) అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం ఆమె చేరినట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నిర్మలా సీతారామన్ ఆదివారం బాగానే ఉన్నారని, మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత వాజ్పేయి జయంతి సందర్భంగా నివాళులు కూడా అర్పించారని, కానీ ఆ మరునాడే ఆమె అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. పలువురు ప్రముఖులు ఫోన్ చేసి ఆమె ఆరోగ్యంపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని పలువురు ప్రార్థిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.