ప్రముఖ స్మారక చిహ్నం తాజ్ మహల్‌పై రూ. 1.9 కోట్ల నీటి పన్ను, రూ. 1.5
లక్షల ఆస్తి పన్ను చెల్లించాలని కోరుతూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
(ASI)కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు
అందజేసింది. ప్రపంచంలోని 7 అద్భుతాల్లో తాజ్‌మహల్ ఒకటి. 2021-22, 2022-23
ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పన్నుఆగ్రా పౌర అధికారులకు పురావస్తు శాఖ(ASI)
చెల్లించాలి.పన్ను బకాయిలను 15 రోజుల్లోగా క్లియర్ చేయాలని నోటీసుల్లో ఆగ్రా మున్సిపల్
కార్పొరేషన్ కోరింది. లేని పక్షంలో తాజ్ మహల్ ‘అటాచ్’ చేయబడుతుందని
హెచ్చరించింది. అయితే, తాజ్‌మహల్‌కు సంబంధించిన పన్ను సంబంధిత చర్యల గురించి
తనకు తెలియదని మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టి.ఫండే అన్నారు. పన్నుల లెక్కింపు
కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిపిన జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్)
సర్వే ఆధారంగా తాజాగా నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు, మతపరమైన
స్థలాలతో సహా అన్ని ప్రాంగణాలకు వాటిపై పెండింగ్‌లో ఉన్న బకాయిల ఆధారంగా
నోటీసులు జారీ చేయబడ్డాయి.

జీఐఎస్ సర్వే ఆధారంగా పన్నును గ్రహించేలా ఓ ప్రైవేట్ కంపెనీకి బాధ్యతలు
అప్పగించారు. యూపీ పురావస్తు శాఖ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్
పటేల్ మాట్లాడుతూ.. “స్మారక కట్టడాలపై ఆస్తి పన్ను వర్తించదు. వాణిజ్యపరమైన
ఉపయోగం లేనందున మేము నీటికి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. తాజ్ మహల్
కోసం నీరు, ఆస్తి పన్నుకు సంబంధించిన నోటీసులు మొదటిసారిగా అందాయి’
అన్నారు. తాజ్ మహల్ 1920లో రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించబడింది. బ్రిటిష్
పాలనలో కూడా, స్మారక చిహ్నంపై ఇంటి లేదా నీటి పన్ను విధించబడలేదు.