రాజ్యసభలోవైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాల్లో ఒకటైన డాక్టర్
బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అంశాన్ని వైఎస్ఆర్సిపి
రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో ప్రత్యేకంగా
ప్రస్తావించారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక లేఖను ఆయన
రాజ్యసభలో సమర్పించారు. తగిన విధంగా చర్యలు తీసుకోవాలని, ఆస్తులు దీని
సంబంధించిన అంశాలను త్వరితగతిన పంపిణీ చేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా
చూడాలని ఆయన రాజ్యసభలో పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్
యూనివర్సిటీ ఆంధ్ర ప్రదేశ్ ఓ ఎస్ డి గా ఉన్న డాక్టర్ వెలగా జోషి ఇచ్చిన
ప్రత్యేక నివేదిక ఆధారంగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో
ఈ అంశాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో కూడా ఈ అంశంపై ఉపరాష్ట్రపతి
పలువురు కేంద్ర రాష్ట్ర ఉన్నతాధికారులు వివిధ పార్టీల నాయకులు దీనిపై
స్పందించాలని ఓ ఎస్ డి డాక్టర్ వెలగా జోషి అభ్యర్థించారు. దీనిపైన ప్రత్యేకంగా
రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటీవల రాజ్యసభలో ఈ అంశంపై
ప్రత్యేకంగా మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విభజన
సమస్యలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అంబేద్కర్ ఓపెన్
యూనివర్సిటీని విభజించి ఏపీలో ఏర్పాటు చేయాలని డాక్టర్ వెలగా జోషి కోరారు.
దీనిపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, ప్రత్యేక సమావేశాలు దీనికి సంబంధించి
ఉన్న ఆధారాలను కూడా ఆయన సమర్పించారు.ఫీజుల రూపంలో ఏడాదికి సుమారు 11 కోట్ల
రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. యూనివర్సిటీ ప్రస్తుతం ప్రధాన
కార్యాలయం హైదరాబాదులోనే ఉంది. దీని పరిపాలన అంతా కూడా హైదరాబాదు నుంచి
జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల నుంచి వేలాదిమంది
విద్యార్థులు వివిధ కోర్సుల కోసం ఫీజులు రూపంలో లక్షలాది రూపాయలను
చెల్లిస్తున్నారు. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోతుంది .కానీ ఈ
యూనివర్సిటీ పరిధిలో రాష్ట్రంలో ఉన్న అధ్యయన కేంద్రాల్లో సిబ్బంది
పనిచేస్తున్నారు. వారికి జీతభత్యాలు మాత్రం ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుంది.
దీనివల్ల విద్యార్థుల ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి
వెళుతుంటే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జీతభత్యాలు మాత్రం ఏపీ ప్రభుత్వం
చెల్లించాల్సి వస్తుంది .ఇంతే కాకుండా యూనివర్సిటీ విభజన పూర్తి కాకపోవడంతో
వివిధ తరగతుల్లో చదివే గ్రాడ్యుయేట్ విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజు పీజీ
విద్యార్థులు డిప్లమా విద్యార్థులు నుంచి 76 అధ్యయన కేంద్రాల నుంచి వసూలు చేసే
ఫీజు మొత్తాన్ని సుమారుగా 11 కోట్ల రూపాయలను హైదరాబాదులో ఉన్న
విశ్వవిద్యాలయానికి చేరుతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన
ఆదాయాలు రాకపోగా దీనిలో పనిచేసే ఉద్యోగుల జీతాలు పదవి విరమణ పొందిన వారి
పెన్షన్లు పార్టీ ఉద్యోగుల వేతనాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం
చెల్లించాల్సి వస్తుంది. తెలుగు అకాడమీ విభజన జరిగింది. అదేవిధంగా డాక్టర్
బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విభజన కూడా జరిగితే విద్యార్థుల నుంచి
వచ్చే ఫీజులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఉంటాయి. దీనివల్ల ఇక్కడ ప్రత్యేక
కోర్సులు, ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని
రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి వివరంగా ఓ ఎస్ డి డాక్టర్
వెలగా చేసి తెలియజేశారు. ఇదే అంశాన్ని రాజ్యసభలో ప్రత్యేకంగా పిల్లి సుభాష్
చంద్రబోస్ ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో డాక్టర్ అంబేద్కర్ ఓపెన్
యూనివర్సిటీ విభజన ప్రక్రియ జరిగే అవకాశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా భావించవచ్చన్నారు.