న్యూ ఢిల్లీ:నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్
రీసెర్చ్ సభ్యునిగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎన్నికయ్యారు. నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది ఔషధ
శాస్త్రాలలో అధునాతన అధ్యయనాలు, పరిశోధనలకు అత్యుత్తమ కేంద్రంగా మారాలనే
లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన మొదటి జాతీయ స్థాయి సంస్థ. ఇది భారత ప్రభుత్వంలోని
రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు
చేయబడిన స్వయంప్రతిపత్త సంస్థ. ఈ సంస్థ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా,
దక్షిణాసియా, ఆఫ్రికా దేశాలకు కూడా ఔషధ శాస్త్రాలు, సంబంధిత రంగాలలో సహకారం
అందించడానికి రూపొందించబడింది. ఈ సంస్థకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి
కౌన్సిల్ మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి తనకు అరుదైన
అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే
ఈ సంస్థకు మెంబర్ గా ఎన్నికవడానికి సహకారం అందించిన వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అలాగే
పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, సహచర సభ్యులకి తన
కృతజ్ఞతలు తెలిపారు.