ఎయిర్ షోలో ఘోర ప్రమాదం
అమెరికా : అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలో నిర్వహించిన వైమానిక ప్రదర్శనలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. రెండు యుద్ధ విమానాలు ఆకాశంలో ఎగురుతున్న సమయంలో ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా,
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం అమెరికాలో టెక్సాస్‌లోని డల్లాస్‌లో వైమానిక ప్రదర్శన జరుగుతున్న సమయంలో బోయింగ్ బీ-17 బాంబర్ యుద్ధ విమానం, పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానం రెండూ ఢీకొన్నాయి. అయితే, బోయింగ్ విమానం ప్రయాణిస్తుండగా మార్గం తప్పిన కోబ్రా
యుద్ధ విమానం వచ్చి దాన్ని ఢీకొట్టింది. దీంతో, పెద్ద శబ్ధంతో విమానాలు నేలపై కుప్పకూలిపోయాయి. ఆకాశంలోనే విమానం ముక్కలైంది. ఈ రెండు విమానాల్లోని పైలట్ల ఆరోగ్య వివరాలపై ఇంకా సమాచారం అందలేదు.
ఈ ప్రమాదంలో పైలట్ల గురించిన సమాచారం ఇంకా నిర్దారించలేదని అమెరికా ఫెడరల్‌ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) వెల్లడించింది. కాగా వైమానిక ప్రదర్శనలు వచ్చిన వారు చూస్తుండగా వీడియోలు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో, ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఎయిర్ ఫోర్స్ వింగ్స్ స్మారకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఈ ప్రమాదం జరిగిందని అసోసియేటెడ్
ప్రెస్ వెల్లడించింది. ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బీ-17 యుద్ధ విమానం రెండో ప్రపంచ యుద్ద కాలంలో కీలక పాత్ర పోషించింది. ఇదే సమయంలో పీ-63 కింగ్ కోబ్రా యుద్ధ విమానాన్ని కూడా తయారుచేశారు. ఈ చిన్న
విమానాన్ని సోవియెట్ ఎయిర్ ఫోర్స్‌కు వ్యతిరేకంగా మాత్రమే వినియోగించినట్టు సమాచారం.
ఎయిర్ షోలో విమానాలు ఢీకొని : రెండు పురాతన యుద్ధవిమానాలు గాల్లో ఢీకొన్న ఘటన అమెరికాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు సమాచారం. అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో విషాదకర ఘటన చోటు చేసుకొంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు ఢీకొని పలువురు మృతి చెందారు. ఈ విమానాలు భూమికి తక్కువ ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఎయిర్‌షోలో
బోయింగ్ బీ-17 బాంబర్ విమానం, బెల్ పీ-63 కింగ్ కోబ్రా విమానం అత్యంత సమీపంలోకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది.
డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ షోలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ‘ది ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్’ ఓ ప్రకటనలో పేర్కొంది. వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎంత మంది మృతిచెందారో మాత్రం అధికారులు వెల్లడించడంలేదు. ఆరుగురు సిబ్బంది చనిపోయి ఉండొచ్చని సమాచారం. వెటర్స్ గౌరవార్థం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఎయిర్‌షోను వీక్షించేందుకు దాదాపు 6 వేల మంది వరకు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ప్రమాదం చోటు చేసుకొంది. ఈ షోను వీక్షిస్తున్న ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై విజయంలో బీ-17 బాంబర్లు కీలక పాత్ర పోషించాయి. ఇక కింగ్‌కోబ్రా విమానాలను ఈ యుద్ధంలో సోవియట్ సేనలు మాత్రమే వాడాయి.