*సైనిక అధికారుల అంగీకారం*
ఇథియోపియా, దాని సమస్యాత్మకమైన టిగ్రే ప్రాంతానికి చెందిన సీనియర్
సైనికాధికారులు సంయుక్త నిరాయుధీకరణ కమిషన్ను ఏర్పాటు చేయడానికి
అంగీకరించారు. ఈ తరుణంలో సోమవారం నుంచి కెన్యా రాజధాని నైరోబీలో కమాండర్లు
సమావేశమవుతున్నారు. శనివారం, వారు అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని
పిలుపునిస్తూ ఒక ఒప్పందంపై సంతకం చేశారు. అసోసియేటెడ్ ప్రెస్ ద్వారా పొందిన
ఒప్పందం కాపీ ప్రకారం, 5 మిలియన్లకు పైగా ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో పౌరులను
రక్షించడానికి, మానవతా సహాయాన్ని సులభతరం చేయడానికి సహకరిస్తామని ఇరుపక్షాలు
ప్రతిజ్ఞ చేశాయి.