స్పెయిన్ మాజీ రాజు జువాన్ కార్లోస్ -1 తన మాజీ ప్రియురాలి వేధింపులపై కోర్టు పోరాటాన్ని ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే… 58 ఏళ్ల కొరిన్నా జు సేన్-విట్జెన్స్టెయిన్-సేన్ అనే మహిళ 84 ఏళ్ల స్పెయిన్ మాజీ రాజుపై దావా వేశారు. అతను 1975 నుంచి 2014లో పదవీ విరమణ చేసే వరకు పాలించాడు. 2012లో వారి సంబంధం తెగిపోయినప్పటి నుంచి ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న జువాన్ కార్లోస్ వేధింపులకు పాల్పడుతున్నాడని బ్రిటిష్ మహిళ ఆరోపించింది. 2020లో 65 మిలియన్ యూరోలు (65 మిలియన్ డాలర్లు) ఆర్ట్‌వర్క్, నగలు, ఇతర విలువైన వస్తువులను తిరిగి ఇవ్వమని అతను తనను వేధించాడని ఆమె లండన్‌లో అతనిపై కేసు వేసింది.