డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన ఔషధం SARS-CoV-2 వైరస్‌లోని ప్రోటీన్ వల్ల కలిగే గుండెపోటును నివారించగలదని ఒక అధ్యయనం కనుగొంది. COVID-19కి కారణమైన SARS-CoV-2లోని నిర్దిష్ట ప్రోటీన్ గుండె కణజాలాన్ని ఎలా దెబ్బతీస్తుందో మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ప్రయోగంలో శాస్త్రవేత్తలు 2DG అని పిలిచే ఔషధాన్ని ఉపయోగించారు. ఆ ప్రోటీన్ గుండెకు సోకే విష ప్రభావాలను తిప్పికొదుతుంది. DRDO సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అభివృద్ధి చేసిన 2DG అనే ఔషధంపై ప్రస్తుతం ప్రపంచం ఆసక్తికరంగా చూస్తోంది. SARS-CoV-2.. వైరస్ శక్తి గ్లైకోలిసిస్, గ్లూకోజ్ విచ్ఛిన్నంపై ఆధారపడి ఉంటుంది. ఔషధం గ్లైకోలిసిస్ ప్రక్రియను అడ్డుకుంటుంది. ఇది గుండెపోటుకు వచ్చే వైరస్ పెరుగుదలను నిరోధిస్తుంది.