ఇమిగ్రేషన్ విధానం మొదటి పరీక్షలో ఇటలీ ప్రభుత్వం 35 మంది శరణార్థులను వారి ఓడ నుండి దిగకుండా నిరోధించింది. వారు ఆశ్రయం కోసం అర్హత పొందలేదని పేర్కొన్నారు. శనివారం రాత్రి, రోమ్ జర్మన్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆర్గనైజేషన్ (SOS) హ్యుమానిటీ నడుపుతున్న హ్యుమానిటీ-1 ఓడలో 179 మందిని తీసుకెళ్ళి, సిసిలీలోని కాటానియా నౌకాశ్రయంలోకి ప్రవేశించడానికి అనుమతించింది. పిల్లలు, అనారోగ్యంతో ఉన్న వారిని మాత్రమే ఇటలీ అనుమతించింది. ఆన్బోర్డ్ వైద్య తనిఖీ తర్వాత, సుమారు 144 మంది ప్రయాణీకులను ద్వీపంలోని రిసెప్షన్ కేంద్రానికి తరలించారు. మిగిలిన శరణార్ధులు మాత్రం ఇంకా ఓడలోనే ఉంటు బిక్కు బిక్కుమంటున్నారు.