ప్రదానం చేసే అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023కు ఎంపికైన 17 మందిలో
అయిదుగురు భారతీయ బాలలు ఉన్నారు. ఈ మేరకు ఐహా దీక్షిత్ (మేరఠ్), మాన్య హర్ష
(బెంగళూరు), నిర్వాణ్ సోమానీ (దిల్లీ), మన్నత్ కౌర్ (దిల్లీ), కర్ణవ్
రస్తోగీ (ముంబయి)లను పురస్కారం వరించింది. అమెరికా స్వచ్ఛంద సంస్థ ‘యాక్షన్
ఫర్ నేచర్’ ఏటా ఈ పురస్కారాలు ఇస్తోంది.
ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఐహా దీక్షిత్ నాలుగేళ్ల వయసు నుంచే
మొక్కలు నాటుతోంది. ఆమె కొందరు వాలంటీర్లతో కలిసి మేరఠ్ నగరంలో 20,000
మొక్కలు నాటింది. ప్రజలు విరాళంగా ఇచ్చిన మొక్కలతో ఒక నిధిని ఏర్పాటుచేసి
ఉచితంగా పంచిపెడుతోంది. 8-12 ఏళ్ల విభాగంలో రెండో స్థానం పొందిన మాన్య హర్ష తన
పుస్తకాలు, బ్లాగ్, యూట్యూబ్ ఛానల్ ‘ది లిటిల్ ఎన్విరాన్మెంటలిస్ట్’తో
పర్యావరణ స్పృహను పెంచుతోంది. 3,500 మొక్కలను నాటి, 3000 విత్తన బంతులను
పంపిణీ చేసింది. 13-16 ఏళ్ల విభాగంలో రెండో స్థానం పొందిన నిర్వాణ్ సోమానీ
ఇతరులు వాడి వదిలేసిన డెనిమ్ జీన్స్ దుస్తులను సేకరించి, మార్పుచేర్పులు
చేసి పేదలకు పంచుతున్నాడు. అలా 6000 జీన్స్‌ను పంచారు. 800 జీన్స్‌ను
దుప్పట్లుగా మార్చి ఇచ్చాడు. తద్వారా ఫ్యాషన్ దుస్తులు చెల్లాచెదురుగా పడి
కాలుష్యం సృష్టించకుండా జాగ్రత్త పడుతున్నాడు. 13-16 ఏళ్ల విభాగంలో మూడో
స్థానం పొందిన మన్నత్ కౌర్ కాలుష్య రహితంగా వ్యర్థ జలాల శుద్ధిని, తాగు నీటి
సరఫరా కార్యక్రమాలను చేపట్టింది. ఇక ఈ ఏడాది విజేతల జాబితాలో గౌరవ స్థానం
పొందిన 13 ఏళ్ల కర్ణవ్ రస్తోగీ ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడం ద్వారా
వాతావరణ మార్పుల నిరోధానికి పాటు పడుతున్నాడు.