వాషింగ్టన్ : వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే
అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆశావహులంతా అధ్యక్ష బరిలో నిలిచేందుకు
సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ అధ్యక్ష ఎన్నికల బరిలోకి మరో భారత సంతతి వ్యక్తి
చేరారు. వ్యాపారవేత్త శివ అయ్యాదురై(59) తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ముంబైలో జన్మించిన ఆయన, 1970లో తన
తల్లిదండ్రులతో సహా అమెరికాకు వలస వెళ్లి పాటెర్సన్లో స్థిరపడ్డారు. దేశంలో
రెండు పక్షాల రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు ఆయన తన
ప్రచార వెబ్సైట్లో తెలిపారు. కాగా, భారత సంతతికి చెందిన హీర్ష్ వర్ధన్
సింగ్, దక్షిణ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ, వ్యాపారవేత్త వివేక్ రామస్వామి
ఇప్పటికే అధ్యక్ష బరిలో ఉన్నారు.