దేశ ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. విక్టరీ డేని పురస్కరించుకొని కిమ్ ఆ
ప్రదర్శన చేపట్టారు. కొరియా యుద్ధం ముగిసి 70 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని
ఉత్తరకొరియా ‘విక్టరీ డే’గా నిర్వహించింది. ఈ మేరకు రాజధాని నగరం
ప్యాంగ్యాంగ్లో కిమ్ ప్రభుత్వం ఆయుధాలను ప్రదర్శించింది. వాటిలో అణు
సామర్థ్యం కలిగిన క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయని స్థానిక మీడియా సంస్థ
వెల్లడించింది. భారీస్థాయిలో నిర్వహించిన ఈ విక్టరీ డే వేడుకలకు చైనా , రష్యా
రక్షణశాఖ ప్రతినిధులు హాజరుకావడం గమనార్హం.
రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగు, చైనా రక్షణ శాఖ ప్రతినిధులు వచ్చారు.
కొవిడ్-19 తర్వాత ఆ స్థాయి వ్యక్తులు ఉత్తర కొరియాలో పర్యటించడం ఇదే
మొదటిసారి. కిమ్ వారికి తన దేశ ఆయుధ సామర్థ్యాన్ని చూపించారు. రష్యా, చైనా
నేతలు సమక్షంలో కిమ్ ప్రదర్శించిన ఈ క్షిపణులపై ఐరాస భద్రతా మండలి గతంలో
నిషేధం విధించింది. అప్పుడు ఆ నిషేధాన్ని ఆ రెండు దేశాలు సమర్థించాయి. అలాగే
ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తోన్న అణ్వాయుధాలు, బాలిస్టిక్ మిస్సైల్స్
విషయంలో కూడా ఆ రెండు దేశాలు దూరం పాటిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అందుకు
విరుద్ధంగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.*
అమెరికాలో బియ్యం వ్యాపారులకు కాసుల వర్షం : ఈ ప్రదర్శనలో ఇటీవల కాలంలో ఉత్తర
కొరియా అభివృద్ధి చేసిన హాసాంగ్-17, హాసాంగ్-18 ఖండాతర బాలిస్టిక్
క్షిపణులు ఉన్నాయి. అవి అమెరికాలోని ఏ లక్ష్యాన్నైనా చేధించగలవని గతంలో
స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రదర్శనతో మానవ రహిత డ్రోన్లను కూడా ఈ
దేశం అభివృద్ధి చేస్తున్న విషయం వెల్లడైంది. డ్రోన్ డిజైన్లను కూడా రష్యా,
చైనా ప్రతినిధులకు చూపించింది. వీటిల్లో కొన్ని డ్రోన్లను గత నెల ఓ
ఎయిర్‌బేస్ నుంచి ఉత్తర కొరియా పరీక్షించింది. ఇవి అమెరికా డ్రోన్లు రీపర్,
గ్లోబల్ హాక్కు నకళ్లవలే ఉన్నట్లు ఎన్కే న్యూస్ పేర్కొంది.