శాన్ డియాగో: చాట్బాట్లు కేవలం 18 నెలల వ్యవధిలో పిల్లలకు చదవడం, రాయడం
నేర్పుతాయని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తెలిపారు. శాన్
డియాగోలో జరిగిన ASU+GSV సదస్సులో ఆయన మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా
కృతిమ మేధ గురించి ప్రస్తావించారు. ‘నానాటికి కృత్రిమ మేధ సామర్థ్యం
పెరుగుతోంది. ఇది భవిష్యత్తుల్లో మరింత విస్తరిస్తుంది. చాట్బాట్లు కేవలం 18
నెలల వ్యవధిలో పిల్లలకు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను చక్కగా
అందించగలుగుతాయి. కంప్యూటర్లు రాయడం నేర్పించలేవు. చాట్బాట్లు అలా కాదు. మనం
ఇచ్చే దాన్ని గుర్తించి.. దానిలో మార్పు చేసుకోగల సామర్థ్యం ఉంటుంది. మానవుల
వలే చక్కగా బోధించగలవు. వారి కంటే మెరుగ్గా కూడా నేర్పించగలవు’’అని అన్నారు.
ఉపాధ్యాయులకు సహాయంగా కృత్రిమ మేధ ఉపయోగపడుతుందన్నారు. ఇవి పిల్లలకు అన్ని
విధాలుగా నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని, గణితంలో సమస్యల సాధనలోనూ
ఉపయోగపడుతుందన్నారు. రాయడంతో పాటు సరిచేసుకోవాల్సిన లోపాలపై సూచనలు కూడా
ఇస్తుందని తెలిపారు. ‘‘చాలా మంది విద్యార్థులకి నైపుణ్యాలను
మెరుగుపరుచుకోవడానికి బోధకుడు కావాలి. ట్యూటర్ల స్థానంలో చాట్బాట్లను
వినియోగించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇవి ప్రస్తుతం అందరికీ
అందుబాటులో ఉన్నాయి’’అని అన్నారు.