సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్‌కు 1,550
పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు
సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్‌కు ఇచ్చిన హామీల్లో 98% వరకు
నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు.
అంతే కాకుండా కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు చెందిన 30 వేల
బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత
ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్ పైచేయిగా
నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా
ఉండగా బుధ, గురు వారాల్లో రష్యా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్ల దాడిలో
ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.
కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల
భవనాలు, 12 ప్రైవేట్ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి.*ఉక్రెయిన్‌కు భారీగా ‘యుద్ధ సామగ్రి’ అందించాం : రష్యా చేస్తోన్న దురాక్రమణను
అడ్డుకుంటున్న ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చిన విధంగా భారీ స్థాయిలో సైనిక, ఆయుధ
సహాయం చేసినట్లు నాటో కూటమి వెల్లడించింది. రష్యా చేస్తోన్న దురాక్రమణను
అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌కు మొదటి నుంచి పాశ్చాత్య దేశాలు వెన్నుదన్నుగా
నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాటో కూటమి భారీ స్థాయిలో సైనిక, ఆయుధ
సహాయం చేస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చిన వాటిలో 98శాతం కంటే
ఎక్కువ సాయుధ వాహనాలు, మందుగుండు సామగ్రి అందించినట్లు నాటో కూటమి
వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సుమారు గంటపాటు
మాట్లాడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించిన మరుసటి రోజే
నాటో నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘1500లకుపైగా సాయుధ వాహనాలతో పాటు 230 ట్యాంకులు, ఇతర పరికరాలు, భారీ మొత్తంలో
మందుగుండు సామగ్రి ఉక్రెయిన్‌కు అందించాం. తొమ్మిదికిపైగా ఉక్రెయిన్
బ్రిగేడ్లకు శిక్షణ ఇవ్వడంతోపాటు ఆయుధాలు కూడా సమకూర్చాం. ఇలా 30వేలకుపైగా
సైనికులతో ఈ కొత్త బ్రిగేడ్లు రూపొందించుకోనున్నాయి. ఇవి రష్యా ఆక్రమిత
ప్రదేశాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఉక్రెయిన్ను బలమైన స్థానంలో
ఉంచుతుంది’ అని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ వెల్లడించారు.
ఉక్రెయిన్ సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు 31 నాటో దేశాల కూటమి నిబద్ధత
కలిగి ఉందన్నారు. ఒకవేశ శాంతి చర్చలు జరిగితే కీవ్‌ను బలమైన స్థితిలో
ఉంచేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. మరోవైపు చైనా-ఉక్రెయిన్ అధ్యక్షుల
మధ్య జరిగిన సంభాషణపై రష్యా తనదైన శైలిలో స్పందించింది. వారిద్దరి మధ్య సంభాషణ
యుద్ధానికి ముగింపు పలుకనుందా..? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఉక్రెయిన్
సంక్షోభానికి ముగింపు పలకడంతోపాటు రష్యా నిర్దేశించుకున్న లక్ష్యాలను
సాధించేందుకు దోహదం చేసే ఎటువంటి ప్రయత్నాన్నైనా స్వాగతిస్తామని క్రెమ్లిన్
అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ఆ రెండు దేశాల మధ్య జరిగిన
సంభాషణ మాత్రం వారి సొంత, ద్వైపాక్షిక చర్చలకు సంబంధించినవని పేర్కొన్నారు.