యుద్ధం సందర్భంగా తమ దేశం నుంచి ఎత్తుకుపోయిన చిన్నారులు 30 మందిని రష్యా
నుంచి వెనక్కు తీసుకొచ్చినట్లు ఉక్రెయిన్ సంస్థ వెల్లడించింది.కీవ్ : యుద్ధం సందర్భంగా తమ దేశం నుంచి ఎత్తుకుపోయిన చిన్నారులు 30 మందిని
రష్యా నుంచి వెనక్కు తీసుకొచ్చినట్లు ఉక్రెయిన్ సంస్థ వెల్లడించింది. ఆ
చిన్నారులందరనీ కీవ్‌కు తీసుకొస్తున్నట్లు సేవ్ ఉక్రెయిన్ ఆర్గనైజేషన్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మికోలా కులేబా తెలిపారు. బాలల హక్కుల సంఘం
కమిషనర్‌గాను ఆయన వ్యవహరిస్తున్నారు. రష్యా సైనిక చర్య చేపట్టినప్పటి నుంచి
ఉక్రెయిన్ చిన్నారులను రష్యా అపహరించుకు పోతుండటం పెద్ద సమస్యగా మారింది. ఈ
నేపథ్యంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్
పుతిన్, రష్యా బాలల హక్కుల కమిషనర్ మారియా ల్వొవా బెలోవాలపై అరెస్టు
వారెంట్‌ను జారీ చేయడం ద్వారా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది.
బలవంతంగా ఎత్తుకుపోయిన చిన్నారులను వారి కుటుంబసభ్యులతో తిరిగి ఏకంచేయాలని
కోరుతూ రెడ్‌క్రాస్‌కు చెందిన అంతర్జాతీయ కమిటీ(ఐసీఆర్సీ) గతవారం ల్వొవా
బెలోవాతో అత్యున్నతస్థాయి చర్చలు జరిపింది. పిల్లల్ని ఎత్తుకుపోవడం, వారిని
రష్యాలో దత్తతకు ఇచ్చే వ్యవహారాల్లో బెలోవా పాత్రను అసోసియేటెడ్ ప్రెస్
వార్త సంస్థ తన పరిశోధనతో వెలుగులోకి తెచ్చింది. అయితే అంతర్జాతీయ సమాజం
పేర్కొంటున్నట్లు ఆ చిన్నారులను తాము అపహరించలేదని, వారిని సురక్షితంగా
ఉంచేందుకే తీసుకెళ్లినట్లు ల్వొవా బెలోవా ఐరాస భద్రతా మండలికి బుధవారం
వెల్లడించారు. కచ్చితమైన సంఖ్య తెలియనప్పటికీ సుమారు 19,500 మంది చిన్నారులను
కుటుంబాలు, అనాథాశ్రమాల నుంచి రష్యా తరలించుకుపోయినట్లు అంచనా.ఈస్టరైనా దాడులు ఆపని రష్యా..ఏడుగురి మృతి

క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ఈస్టర్ రోజైనప్పటికీ ఆదివారం రష్యా
ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు పౌరులు దుర్మరణం
పాలయ్యారు. ఉక్రెయిన్ తూర్పు పారిశ్రామిక ప్రాంతం, ఖర్కీవ్, జపోరిజియాలపై
రష్యా క్షిపణి, రాకెట్, ఆర్టిలరీ దాడులు నిర్వహించింది.