అమెరికా : అమెరికాపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్ తాజాగా
అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను బెదిరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు
చేసింది. ఆయనను అంతమొందించేందుకు ఎదురుచూస్తున్నాని ఇరాన్ కమాండర్
హెచ్చరించారు. అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలతో సతమతమవుతోన్న ఇరాన్ ఆయుధ
సంపత్తిని పెంచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ
క్రూజ్ క్షిపణి ని అభివృద్ధి చేసింది. ఈ సందర్భంగా ఆ దేశ రెవల్యూషనరీ
గార్డ్స్ కమాండర్ ఒకరు మాట్లాడుతూ తమ టాప్ కమాండర్‌ను చంపినందుకు
అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు
డొనాల్డ్ ట్రంప్ ను అంతమొందిస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.1,650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్రూజ్ క్షిపణిని ఇరాన్
అభివృద్ధి చేసిందని రెవల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ అధినేత అమిరాలి
హజీజాదే వెల్లడించారు. ఈ సందర్భంగా ఇరాన్ అధికారిక టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ
ఇచ్చిన ఆయన అమెరికాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘2020లో బాగ్దాద్‌లో అమెరికా
జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమాని మరణించారు.
దానికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా దళాలపై మా బలగాలు బాలిస్టిక్
క్షిపణులను ప్రయోగించాయి. అయితే అమాయక సైనికులను చంపాలన్నది మా ఉద్దేశం కాదు.
మా లక్ష్యం ట్రంప్. ఆయనను అంతమొందించేందుకు ఎదురుచూస్తున్నాం. సులేమాని
హత్యకు ఆదేశాలు జారీ చేసిన మైక్ పాంపియో(అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి), ఆ
దేశ మిలిటరీ కమాండర్లు కూడా ప్రాణాలతో ఉండకూడదని హజీజాదే తీవ్ర వ్యాఖ్యలు
చేశారు.

సులేమానీ మరణం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి
చేరుకున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పదే
పదే హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే రష్యాతో మిత్రబంధాన్ని పెంచుకుంటున్న
ఇరాన్ మాస్కోకు డ్రోన్లను కూడా సరఫరా చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఆ
డ్రోన్లను ఉపయోగించడంపై అమెరికా సహా పశ్చిమ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం
చేశాయి. తాజాగా ఇరాన్ క్రూజ్ క్షిపణి అభివృద్ధి చేయడం ఈ ఉద్రిక్తతలను మరింత
తీవ్రతరం చేసినట్లైంది.