గూగుల్ సంస్థకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్
ట్రైబ్యునల్ విధించిన జరిమానాను వ్యతిరేకిస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను
సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు అపరాధ రుసుమును వారంలోగా
చెల్లించాలని గడువిచ్చింది.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి (సిసిఐ) గూగుల్ మధ్య జరిగిన న్యాయ పోరాటంలో
గూగుల్ కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్
ఇండియా విధించిన రూ. 1,337 కోట్ల జరిమానాను సుప్రీంకోర్టు సమర్థించింది,
నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) జారీ చేసిన ఉత్తర్వులపై స్టే
ఇవ్వడానికి నిరాకరించింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా జరిమానా నిర్ణయాన్ని
NCLAT కూడా సమర్థించింది. దీనితో పాటు రూ.1,337 కోట్ల జరిమానాలో 10% డిపాజిట్
చేయాలని గూగుల్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో గూగుల్ సుప్రీంకోర్టును
ఆశ్రయించడంతో ఇప్పుడు అక్కడ కూడా గూగుల్ కి ఎదురుదెబ్బ తగిలింది. CCI
నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)
ధనంజయ్ Y చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం Googleకి ఒక వారం సమయం ఇచ్చింది. ఈ
ఒక్క వారంలో గూగుల్ మొత్తం జరిమానాలో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.దీంతో
బెంచ్ గూగుల్ పిటిషన్‌ను ఎన్సిఎల్ఎటికి తిరిగి పంపింది.ఈ అంశంపై మార్చి
31లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎన్‌సిఎల్‌ఎటిని కోరింది. బెంచ్‌లో
జస్టిస్ పిఎస్ నరసింహ మరియు జెబి పార్దివాలా కూడా ఉన్నారు.