పెరుగుతోంది. దుర్ఘటన సమయంలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే,
ఇటువంటి ప్రమాదాలు నేపాల్‌లో సర్వసాధారణంగా మారిపోయాయి.
ప్రమాదాలను ఓసారి పరిశీలిస్తే.2023 జనవరి 15: నేపాల్ రాజధాని కాఠ్మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు
వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్ నేల కూలిపోయింది. ఈ దుర్ఘటన సమయంలో అందులో 72మంది
ఉన్నారు. ఇప్పటివరకు 40 మృతదేహాలను వెలికి తీయగా మరిన్ని వాటికోసం సహాయక
చర్యలు కొనసాగుతున్నాయి.
2022 మే 29: తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఘోర ప్రమాదానికి
గురయ్యింది. అందులో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ముత్సాంగ్
జిల్లాలోని కొండలను ఢీకొట్టడంతో జరిగిన ఆ ప్రమాదంలో నలుగురు భారతీయులు, ఇద్దరు
జర్మన్ దేశీయులు కూడా చనిపోయారు.
2016 ఫిబ్రవరి 24: ఇదే విమానయాన (తారా) సంస్థకు ఓ విమానం గతంలోనూ ఇదే మార్గంలో
ప్రమాదానికి గురయ్యింది. ముత్సాంగ్ జిల్లాలో జరిగిన ఆ ఘటనలో అందులో
ప్రయాణిస్తోన్న మొత్తం 23 మంది ప్రాణాలు కోల్పోయారు.
2018 మార్చి 12 : కాఠ్మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో
దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం
కుప్పకూలిపోయింది. దట్టమైన మేఘాల కారణంగా జరిగిన ఆ దుర్ఘటనలో మొత్తం 51 మంది
మృత్యువాతపడ్డారు.
2014 ఫిబ్రవరి 16 : ప్రతికూల వాతావరణం కారణంగా జరిగిన ఓ విమాన ప్రమాదంలో
18మంది చనిపోయారు.
2012 సెప్టెంబర్ 28: సీతా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం త్రిభువన్
విమానాశ్రయంలో అత్యవసరంగా దిగేందుకు ప్రయత్నించింది. అప్పుడు చోటుచేసుకున్న
ప్రమాదంలో 19మంది ప్రాణాలు కోల్పోయారు.
2012 మే 14: పొఖారా నుంచి జామ్‌సమ్‌కు వెళ్తోన్న ఓ విమానం జామ్సమ్
ఎయిర్‌పోర్టుకు సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. ఆ ఘటనలో 15 మంది చనిపోయారు.
2011 సెప్టెంబర్ 25: ఎవరెస్ట్ శిఖరాన్ని చూసేందుకు విదేశీ పర్యాటకులను
తీసుకెళ్తోన్న ఓ చిన్న విమానం ప్రమాదానికి గురయ్యింది. అందులో ప్రయాణిస్తోన్న
19 మంది ప్రాణాలు కోల్పోయారు.
2010 డిసెంబర్ 16: తూర్పు నేపాల్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో 22మంది
మృత్యువాతపడ్డారు. అంతకుముందు అదే ఏడాది ఆగస్టు 24న జరిగిన ప్రమాదంలో 12 మంది
చనిపోయారు. అందులో నలుగురు అమెరికన్లు, బ్రిటన్, జపాన్ దేశస్థులు కూడా
ఉన్నారు.
2008 అక్టోబర్ 8: ఈశాన్య నేపాల్‌లో ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఆ
ప్రమాదంలో 18 మంది చనిపోగా.. అందులో ఎక్కువగా విదేశీయులే ఉన్నారు.
వీటితోపాటు కొన్ని హెలికాప్టర్ ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి.
2019 ఫిబ్రవరి 27: తూర్పు నేపాల్‌లోని కొండల ప్రాంతంలో ఓ హెలికాప్టర్
ప్రమాదానికి గురయ్యింది. అందులో పర్యాటక శాఖ మంత్రితోసహా ఏడుగురు చనిపోయారు.
2016 మార్చి 12: పశ్చిమ నేపాల్‌లోని కాలీకోట్ జిల్లాలో ఓ చిన్న విమానానికి
జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.