చైనా : చైనా కుబేరుడు, స్థిరాస్తి వ్యాపార దిగ్గజం ఆర్ అండ్ ఎఫ్ అధినేత జాంగ్ లీ జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కొత్త మార్గాన్ని అన్వేషించారు. లండన్‌లో ఉంటున్న ఆయన సొంత లగ్జరీ అపార్టుమెంట్లోనే తనను తాను
నిర్బంధించుకున్నారు. నిర్మాణ అనుమతుల కోసం శాన్ఫ్రాన్సిస్కో అధికారులకు లంచాలిచ్చారని ఇతడిపై ఆరోపణలున్నాయి. జాంగ్లీని విచారించి అరెస్టు చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నుంచి వచ్చిన జాంగ్ లీని గతేడాది నవంబర్ 30న లండన్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, జైలులో ఉండేందుకు
నిరాకరించిన జాంగ్ లీ.. సొంత ఇంట్లోనే తనను తాను నిర్బంధించుకున్నారు. అమెరికాకు అప్పగించకూడదని కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. సెక్యూరిటీ కోసం అయ్యే మొత్తాన్ని చెల్లించేందుకు జాంగ్లీ తరఫు న్యాయవాదులు అంగీకరించారు.చైనాలో ఆర్అండ్ఎఫ్ ప్రాపర్టీస్ సహ వ్యవస్థాపకుడైన జాంగ్ లీపై.. అమెరికాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా నిర్మాణ అనుమతుల కోసం శాన్ఫ్రాన్సిస్కో అధికారులకు పెద్దఎత్తున లంచం ముట్టజెప్పారనే కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. చైనా పర్యటనకు వెళ్లిన కొందరు అమెరికా అధికారులకు వసతి కల్పించడంతోపాటు, బహుమతులు అందజేశారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా వారికి 40 వేల డాలర్ల నుంచి 70 వేల డాలర్ల వరకు లంచాన్ని చెల్లించారనే అభియోగాలు నమోదయ్యాయి. జాంగ్‌పై వచ్చిన లంచం ఆరోపణలను ఆయన సంస్థ ఆర్అండ్ఎఫ్ తోసిపుచ్చింది.

ఈ నేపథ్యంలో సింగపూర్ నుంచి వచ్చిన జాంగ్ లీను గతేడాది నవంబర్ 30న లండన్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, జైలులో ఉండేందుకు నిరాకరించిన జాంగ్ లీ తన సొంత ఇంట్లోనే నిర్బంధించుకున్నారు. ఈ కేసుకు సంబంధించి జాంగ్ లీ బెయిల్‌పై లండన్ కోర్టులో ఇటీవల వాదనలు జరిగాయి.