మాస్కో : ఒకవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్ సహాయం పొందుతుండగా
రష్యానేమో కొత్త క్షిపణులతో ఉన్న యుద్ధ నౌకను అట్లాంటిక్ మహాసముద్రంలో
మోహరించింది. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర
కొనసాగిస్తూనే ఉంది. వచ్చె నెలకు ఈ యుద్ధం మొదలై సంవత్సరం కానుంది. ఈ వ్యవధిలో
ఇరువైపులా భారీ ప్రాణ నష్టం సంభవించింది. బాంబుల మోతతో ఉక్రెయిన్లో పలు
ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. రష్యాపై ఆర్థిక భారం పడింది. శాంతి చర్చల మాటలు
వినిపిస్తున్నా యుద్ధాన్ని ఎలా ముగింపు ఇవ్వాలో తెలీక ఇరువర్గాలు తలలు
పట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తనపై ఉన్న వ్యతిరేకతను
తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నియో నాజీ సిద్దాంతంపై జరుపుతోన్న
పోరుకు సంబంధించిన డాక్యుమెంటరీలను ఫిబ్రవరి కల్లా థియేటర్లలో ప్రదర్శించాలని
ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ డాక్యుమెంటరీలను నిర్మించేవారికి సహకారం
అందించాలని రక్షణశాఖను పురమాయించారు. ప్రత్యేక ఆపరేషన్లో పాల్గొంటున్న
సైనికుల హీరోయిజం వీటిలో ప్రధానాంశంగా ఉంటుంది. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి
అక్కడి ప్రభుత్వ చానళ్లు రష్యన్ బలగాలపై పొగడ్తలు కురిపిస్తున్నాయి.
వ్యతిరేకించిన అనేక స్వతంత్ర మీడియా సంస్థలు మూసివేతకు గురయ్యాయి. దాంతో
ఎంతోమంది పాత్రికేయులు దేశం వీడాల్సిన వచ్చింది. అలాగే ‘యుద్ధం’, ‘దురాక్రమణ’
వంటి పదాలపై నిషేధం విధించింది. ఎవరైనా ఉక్రెయిన్ యద్ధం గురించి విమర్శలు
చేస్తే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.మరే దేశం వద్ద ఈ ఆయుధాలు లేవు : ఒకవైపు అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి
ఉక్రెయిన్ సహాయం పొందుతుండగా రష్యానేమో కొత్త క్షిపణులతో ఉన్న యుద్ధ నౌకను
అట్లాంటిక్ మహాసముద్రంలో మోహరించింది. దీనిపై రక్షణ శాఖ మంత్రి,
ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధ్యక్షుడు పుతిన్
మాట్లాడుతూ ‘ఆ నౌక జిర్కన్ హైపర్సోనిక్ క్షిపణులను కలిగి ఉంది. ఇవి
అత్యాధునికమైనవి. బయటి నుంచి రష్యాకు పొంచి ఉన్నముప్పు నుంచి ఇవి రక్షిస్తాయని
నేను విశ్వస్తిస్తున్నాను. వీటితో పోటీపడే ఆయుధాలు మరే దేశం వద్ద లేవని
వెల్లడించారు. ‘ఇది శత్రవుపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదు. ఎలాంటి
క్షిపణి రక్షణ వ్యవస్థనైనా అధిగమించే సామర్థ్యం కలదు. ధ్వని వేగం కంటే
తొమ్మిది రెట్లు వేగంతో దూసుకెళ్తుందని రష్యా రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు.