జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కుటుంబానికి
స్నేహితురాలైన ప్రవాస భారతీయురాలు, ప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలు రీనా వినోద్
పుష్కర్ణను భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారానికి ఎంపిక
చేసింది. ప్రవాసీయులకు ఇచ్చే ఈ అత్యున్నత అవార్డుకు ఈ ఏడాది 21 మందిని ఎంపిక
చేసినట్లు ప్రకటించారు. ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని
ఇందౌర్‌లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం
చేస్తారు. ఆర్మీ కుటుంబంలో జన్మించిన రీనా తన భర్త వినోద్‌తో కలిసి 1983లోనే
ఇజ్రాయెల్‌కు వచ్చేశారు.అప్పట్లోనే ‘తందూరి’ అనే రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసి, ఇక్కడి వారికి భారతీయ
రుచులను పరిచయం చేశారు. ఆ రోజుల్లోనే నెతన్యాహు తన కాబోయే భార్య సారాను
మొదటిసారి ఈ రెస్టారెంట్లోనే కలిశారు. అనంతరం వారిద్దరికీ పెళ్లి జరగడంతో
సరదాగా గడపడానికి వచ్చేవారు. అప్పటి నుంచి రీనాకు, నెతన్యాహు కుటుంబానికి మంచి
స్నేహం ఏర్పడింది. ఆ పరిచయంతోనే 2017లో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చినపుడు
ఆయనకు ఆహారాన్ని తయారుచేసే ఉన్నతస్థాయి బృందంలో ఒకరిగా రీనాను ఎంపికచేశారు.