29 మంది మృతి : గల్లంతైన 25 మంది
మనీలా : భారీ వర్షాలు, వరదలు ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటి వరకు 29 మంది మృతి చెందగా 25 మంది గల్లంతయ్యారని జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ వెల్లడించింది. ఇందులో ఉత్తర మిండనావ్ ప్రాంతంలో 18మంది మరణించారు. తూర్పు విసయాస్లో 12 మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మత్స్యకారులే ఉన్నారని అన్నారు. 86,000 మందికి పైగా ఇంకా అత్యవసర పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. దాదాపు 3,200 గృహాలకుపైగా ధ్వంసం అయ్యాయని అధికారులు వెల్లడించారు.