తదుపరి ప్రధానిగా ప్రచండ
నాటకీయ పరిణామాల మధ్య నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు సీపీఎన్-ఎంసీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ ప్రచండ. ప్రధాని పదవిని రొటేషన్ పద్ధతిలో చేపట్టాలన్న ఒప్పందంపై సంధి కుదరకపోవడం వల్ల.. ప్రస్తుత సంకీర్ణ కూటమి విచ్ఛిన్నం కాగా మాజీ ప్రధాని ఓలితో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రచండ సిద్ధమయ్యారు. ఆయన నియామకానికి నేపాల్ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.