దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 196 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. భారత్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 196 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసులు: 4,46,77,302
మరణాలు: 5,30,695
యాక్టివ్ కేసులు: 3,428
రికవరీలు: 4,41,43,179
దేశంలో ఆదివారం 29,818 మందికి కొవిడ్ టీకాలు అందించగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,20,05,46,067 కు చేరింది. ఒక్కరోజే 35,173 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.