పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ భారత్ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. పంజాబ్ అమృత్సర్ జిల్లాలో చక్కర్లు కొడుతున్న పాక్ డ్రోన్‌పై బీఎస్ఎఫ్ కూల్చివేసింది. అనంతరం ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాకిస్థాన్ డ్రోన్ల పరంపర హద్దు మీరిపోతోంది. భారత్‌లోకి అక్రమంగా డ్రోన్ల చొరబాటు రోజురోజుకు ఎక్కువవుతోంది. ఆదివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్సర్ పరిధిలో గల రాజతల్ గ్రామంలోకి వచ్చిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం అడ్డగించి కాల్పులు జరిపింది. సరిహద్దు ఫెన్సింగ్ సమీపంలో క్వాడ్‌కాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఇంకా వేరే ఏవైనా అనుమానాస్పద పదార్థాలు పడిపోయాయనే కోణంలో సోదాలు జరుపుతున్నామని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
వారం రోజుల్లో మూడు డ్రోన్లను : పంజాబ్‌లో గత వారం రోజుల్లో మూడు పాకిస్థాన్ డ్రోన్లను సరిహద్దు దళం కూల్చివేసింది. చలికాలం అవ్వడం వల్ల పొగ మంచు ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరా చేసుకుని ముష్కరులు.. డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలను పంపుతున్నారు. కొన్నిసార్లు మాదకద్రవ్యాల ప్యాకెట్లను సరిహద్దుల వద్ద ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లోకి విసురుతున్నారు.