మాస్కో : రష్యా సైబీరియా ప్రాంతంలో ఉన్న కెమెరోవో నగరంలో శనివారం ఓ ప్రైవేటు భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. 22 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. రష్యా సైబీరియా ప్రాంతంలో ఉన్న కెమెరోవో నగరంలో శనివారం ఓ ప్రైవేటు భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. 22 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. క్లిష్ట జీవన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారి పునరావాస కేంద్రాన్ని ఆ భవనంలో నడుపుతున్నారు. భవన యజమానిని అరెస్టు చేశామని, అతను ఒక మతగురువుగా భావిస్తున్నామని అధికారులు తెలిపారు. బొగ్గు ఆధారిత బాయిలర్ సరిగ్గా పని చేయకపోవడం వల్లే ఇది జరిగిందని స్థానికులు చెబుతున్నారు.