డిసెంబర్ 19 నుంచి మూడు రోజులపాటు వేడుకలు
రక్తదానశిబిరాలు,సేవా కార్యక్రమాలు,చర్చా కార్యక్రమాలు,మహిళలకు పలు అంశాలపై
పోటీలు,క్రీడా పోటీలు
విజయవాడ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,రాష్ర్ట ముఖ్యమంత్రి వైయస్
జగన్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ర్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలను
నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. వైయస్ జగన్ డిసెంబర్ 21వతేదీ 2022
నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని
స్ధాపించి ప్రజల ఆధరాభిమానాలతో 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో 151
స్ధానాలలో గెలుపొంది దేశంలోనే చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా అధికారం
చేపట్టిన నాటినుంచి నేటి వరకు రాష్ర్ట సర్వతోముఖాభివృద్దికి అహిర్నిశలు
శ్రమిస్తున్నారు. ముఖ్యంగా పేదలు ఎస్సిఎస్టిబిసి మైనారిటీల అభ్యున్నతి కోసం
అనేక సంక్షేమ,అభివృద్ది పధకాలు ప్రవేశ పెట్టి వాటిని విజయవంతంగా అమలు
చేస్తున్నారు. ప్రపంచాన్నే వణికించిన కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొని ప్రజల్లో
ధైర్యం నింపడంతోపాటు వారికి ఆర్దికంగా తోడ్పాటును అందించారు. ఈరోజు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోట్లాదిమంది హృదయాలలో స్ధానం సంపాదించారు. 50 వ
జన్మదినోత్సవాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు
ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున భాగస్వాములయ్యే విధంగా వాటిని ప్రతి నియోజకవర్గం
లోను నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుకలు ఈ నెల 19 వతేదీన రాష్ర్టంలోని ప్రతి
అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రారంభమవుతాయి. అంతేకాదు తెలుగు రాష్ర్టాలతో
పాటు ఇతర రాష్ర్టాలలోను,విదేశాలలోను వీటిని నిర్వహించడం జరుగుతుంది. వాటిలో
ప్రదానంగా తేదీల వారీగా చూస్తే డిసెంబర్ 19 వతేదీన క్రీడల పోటీలు.ప్రతి
అసెంబ్లీ నియోజకవర్గంలో పలు క్రీడాంశాలకు సంబంధించి పోటీలు నిర్వహిస్తారు.
డిసెంబర్ 20 వతేదీన మొక్కలు నాటే కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ
కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. స్వచ్చంద సంస్థలు, మేథావులు, కుల సంఘాల
ప్రతినిధులతో జగనన్న పరిపాలన – రాష్ట్ర సంక్షేమం – అభివృద్ధి పై చర్చా
వేదికలు. ముందస్తు జన్మదిన వేడుకల నిర్వహణ. డిసెంబర్ 21 వతేదీన కేక్
కటింగ్లు, రక్తదాన శిబిరాలు, అనాధ,వృధ్దాశ్రమాలలో పండ్లపంపిణి, దుస్తుల
పంపిణి, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు జరుగుతాయి. మహిళలకు సంబంధించి
పలు అంశాలలో పోటీలు. ముఖ్యంగా రక్తదాన శిబిరాల గురించి చెప్పాలంటే రెడ్ క్రాస్
సంస్ధతో కలసి వాటిని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు,వైయస్సార్, వైయస్
జగన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్న ఇతర రాష్ర్టాలు,విదేశాలలో
కూడా వీటిని నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు జరిగాయి. గతంలో వైయస్ జగన్
జన్మదినం సందర్భంగా 38 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించడం
జరిగింది. ఆ విధంగా సేకరించిన రక్తం ఎందరిని అత్యవసర సమయాల్లో ఆదుకుంది.
మరెందరికో పునర్జన్మను అందించింది. మరెందరికో స్ఫూర్తిని ఇచ్చింది. అందుకే ఈ
సారి కూడా రెడ్ క్రాస్ సంస్ధతో కలసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రక్తదాన
శిబిరాలు నిర్వహిస్తోంది.ఈ విధంగా సేకరించిన రక్తాన్ని భధ్రపరిచి అవసరమైన
రోగులకు అందిస్తారు.మరో వినూత్న కార్యక్రమం ఏమంటే రక్తదాతల నుంచి ప్లెడ్జ్
ఫారమ్స్ సేకరించి రోగులకు అత్యవసరమైేన సందర్భాలలో రక్తం అందించేవిధంగా
చేయనున్నారు.ఇందుకు గాను “TAKE THE PLEDGE SAVE A LIFE” అనే నినాదంతో
భవిష్యత్తులో అత్యవసర పరిస్దితులలో రక్తదానం చెయ్యడానికి సుముఖంగా ఉన్నవారిచే
ysrcpblooddonation.com వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమం కూడా
జరుగుతుంది. పేర్కొన్న కార్యక్రమాలే కాకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా
విభిన్న రీతుల్లో డ్వాక్రా, మహిళా, కుల, ప్రజాసంఘాలు, మేథావులు, అభిమానులు,
మరీ ముఖ్యంగా లబ్ధిదారులను భాగస్వామ్యం చేస్తూ వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
ఘనంగా నిర్వహించేలా పార్టీ తగిన ఏర్పాట్లు చేస్తోంది.