రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్ కె రోజా
విశాఖపట్నం : విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను
చేరుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్ కె
రోజా అన్నారు. ఆదివారం సాయంత్రం ఉడా చిల్డ్రన్ పార్క్ లో ఏర్పాటు చేసిన 12వ
జాతీయ మినీ రోల్ బాల్ క్రీడల్లో గెలుపొందిన క్రీడా కారులకు బహుమతి ప్రదాన
కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11సం.రాలలోపు
చిన్నారులతో ఈ క్రీడలు మన రాష్ట్రంలో నిర్వహించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
19 రాష్ట్రాల నుంచి క్రీడా కారులు పాల్గొన్నారని తెలిపారు. అనంతరం క్రీడల్లో
గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో రాజస్థాన్ మొదటి బహుమతి
పొందగా, బాలికల విభాగంలో ఒడిషా రాష్ట్రం మొదటి బహుమతి పొందింది. ఈ
కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు వరుదు కళ్యాణి, పివిఎన్ మాధవ్,
ఆంధ్రప్రదేశ్ రోల్ బాల్ అసోషియేషన్ ప్రెసిడెంట్ జి.చందర మౌళి , కోచ్ లు,
క్రీడాకారులు పాల్గొన్నారు.