అమరావతి : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు తనలోని రాక్షసత్వాన్ని
బయట పెట్టుకుంటున్నాడని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం పలు అంశాలు
వెల్లడించారు. మాచర్లను మండించాడు మరి ఎచ్చెర్లలో ఏం చేస్తాడో అని
అన్నారు. టీడీపీ రౌడీలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి
చేస్తున్నారని చెప్పారు. అధికారంలో లేకపోతే చాలు… గుడులు, బడులను సైతం
తగలబెట్టి చలి కాల్చుకునే తత్వం చంద్రబాబుదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే
కక్షలు కార్పణ్యాలు రగిల్చి మళ్లీ లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని ఆరోపించడం
సిగ్గుచేటన్నారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడు – ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు
మన రాష్ట్రానికి ఖర్మ అని విజయసాయి రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రూ.250 కోట్లతో దేవాలయాలు అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 250 కోట్లు (సీజీఎఫ్) కామన్ గుడ్
ఫండ్ నిధులతో రాష్ట్రంలో 550 చిన్న చిన్న దేవాలయాలు అభివృద్ధి చేయనుందని
విజయసాయి రెడ్డి వెల్లడించారు. దేవాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా
సందర్శకుల తాకిడి మరింత పెరుగుతుందని అన్నారు.