వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి
విజయవాడ : ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ప్రచార ఆర్బాటాలు, కృత్రిమ
బిల్డప్పులు ఎన్ని చేయించుకున్న ప్రజలు నమ్మే చాన్సే లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ అనుబంధ విభాగాలు కోఆర్టినేటర్,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.
పలు అంశాలపై ఆయన ట్విట్టర్ స్పందించారు. చంద్రబాబు ప్రచార ఆర్బాటాలు కోసం చేసే
కార్యక్రమాలన్ని ప్రీప్లాన్డ్ గా జరుగుతయాని అందులో బాగంగానే ఇటివల ఐఎస్బీ
సమావేశాన్ని తన ప్రచారం కోసం ఉపయోగించుకున్నడని చెప్పారు. మనం పాలకులం కాదు
ప్రజా సేవకులం అన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలను ఆయన
గుర్తు చేశారు. కొన్ని కోట్ల మంది పేదలు మన మీద ఆధారపడి ఉన్నారని, మనం
అధికారంలోకి రావడం ద్వారా పేదలకు న్యాయం జరుగుతుందని, గడపగడపకు కార్యక్రమం
ప్రజలతో మమేకమయ్యేందుకు గోప్ప అవకాశం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
పిలుపునిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో ఆయన ప్రస్తావించారు.