అమరావతి : ఢిల్లీలో జరిగిన 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భాగస్వామ్యమయ్యారు.
భారత రాజ్యాంగంలోని 11వ మరియు 12వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా పారిశుధ్యం,
ఆరోగ్యం, అటవీ తదితర ప్రజా సౌకర్యాలను అమలు చేసే సేవలపై జీ ఎస్ టీ ని
మినహాయించాలని ఆర్థిక మంత్రి బుగ్గన కోరారు. ఇన్పుట్ ట్యాక్స్ ప్రభావం
లేనందున, మ్యాన్ పవర్ సేవలను అందించడం కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఏపీసీవోఎస్ ద్వారా ప్రభుత్వానికి ,
ప్రభుత్వ సంస్థల కోసం ఏర్పాటు చేసిన మానవ వనరులను మినహాయింపు జాబితాలో
చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆదాయాల లీకేజీని అరికట్టడానికి మెరుగైన డేటా
అనలిటిక్స్ కోసం ఇతర ప్రభుత్వ శాఖల నుండి సమాచారాన్ని పంచుకోవడంపై ఆయన పలు
అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. జీఎస్టీఆర్ 2ఎ యొక్క తప్పనిసరి షరతు
లేకపోవడం, బీమా కంపెనీల ద్వారా నాన్ క్లెయిమ్ బోనస్ మినహాయింపుల ప్రకారం
డీలర్ల సౌలభ్యం కోసం చేపట్టిన సవరణలు 2017-18, 18-19, 19-20 లో కొంత
భాగానికి సంబంధించిన సి ఏ ధృవీకరణ ఆధారంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను
పరిగణనలోకి తీసుకోవడానికి చేపట్టిన కేంద్ర ప్రతిపాదనలకు మంత్రి బుగ్గన
మద్దతు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ సదస్సుకు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఎన్.
గుల్జర్ (ఆదాయపు పన్నులు), రాష్ట్ర పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఎం. గిరిజా
శంకర్ తదితరులు హాజరయ్యారు.