మద్దతు తెలిపిన ఏపిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అమరావతి రైతుల ఉద్యమానికి అండగా
ఉంటుందని ఏపిసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హామీ ఇచ్చారు. ఆమేరకు ఈ రోజు
న్యూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద అమరావతి రైతులు తలపెట్టిన ధర్నా
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ ఇటీవల భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీ ని కలిసిన అమరావతి
రైతులకు కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికే కట్టుబడి ఉందనే విషయాన్ని
గుర్తుచేసారు. అలానే 2024 లో అధికారంలోకి రాగానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక
హోదా తొలి సంతకం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వలనే అని జోస్యం చెప్పారు. అలానే
అమరావతిని రాజధానిగా గుర్తుస్తాం అని అన్నారు. పునర్విభజన చట్టం లోని అన్నీ
అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం 2024 లో నెరవేరుస్తుందని గిడుగు అన్నారు. కాబట్టి
ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఆదరించాలని ఆయన కోరారు.