* ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రామ్ రివ్యూలో కీలకమైన సూచనలు చేశారు
* మీడియాతో ప్రభుత్వ సలహాదారులు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
విజయవాడ : ప్రస్తుతం ఉన్న ఎంఎల్ఏలందరూ క్యాండిడేట్లే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి
వైయస్ జగన్ ఓపెన్ గా చెబుతున్నారు. ఇప్పుడున్న అభ్యర్దులందరూ మళ్లీ రావాలి.
ఇలా చేస్తే తిరిగి మీరందరూ గెలిచి వస్తారు. అందుకు అవకాశం ఉంటుంది. ఈ
అవకాశాన్ని వదులుకోవద్దని అందరికి చెబుతున్నారు. మీరు తిరగండి. మీ పిల్లలను
తిప్పండి అని చెబుతున్నారు. దానిని వేరే దృష్టితో చూడద్దు. పాజిటివ్ గా
చూడాలని ప్రభుత్వ సలహాదారులు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి
చెప్పారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా
ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు
సమాధానమిస్తూ మా శాసనసభ్యులు,నియోజకవర్గసమన్వయకర్తలు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి
ప్రభుత్వం వారికి ఏమేం చేసిందో తెలియచెప్పే ప్రోగ్రామ్. గడపగడపకు మన ప్రభుత్వం
అనే కార్యక్రమం. ఇంతపెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలకు ఏమైనా
రానివి పధకాలు ఉన్నట్లయితే శాచ్యురేషన్ బేసిస్ పై ఇస్తున్నారు కాబట్టి అందుకు
తగినట్లుగా వాడుకోవడానికి,ఈ మూడేళ్లలో లబ్దిదారుల కుటుంబాలలో వచ్చిన మార్పులు
అబ్జర్వ్ చేయడానికి రాజకీయంగా శ్రీ వైయస్ జగన్ ప్రతినిధిగా
ఎంఎల్ఏ,సమన్వయకర్తలు వెళ్ళేందుకు ఉపయోగపడే కార్యక్రమం. అల్టిమేట్ గా
చెప్పాలంటే పార్టీకి, ప్రభుత్వానికి, మా ప్రజాప్రతినిధులకు పనికివచ్చే
కార్యక్రమం.
అన్నిటికంటే ముఖ్యమైనదేమంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో
అవి ప్రజలకు చేరకపోతే పర్పస్ సర్వ్ కాదు. ఆ మెకానిజంలో పెద్ద పార్ట్ అయిన
ఎంఎల్ఏ లు వారి రోల్ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఉంటుంది. పైగా వారికి భాధ్యత
కూడా ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి గడపగడపకు మన ప్రభుత్వం ప్రోగ్రామ్ ను రివ్యూ
చేసేటప్పుడు సహజంగానే సీరియస్ గా ఉంటుంది. ఈ రివ్యూ అనేది కాలేజ్ స్టూడెంట్స్
కో,స్కూల్ స్టూడెంట్స్ కో ఉన్నట్లు ఎందుకు ఉంటుంది. అందరూ నాయకులే. వైయస్ జగన్
ప్రతిసారి అదే చెబుతుంటారు. అందరూ ఈక్వల్. తాను కోఆర్డినేటర్ లాంటి వాడిని
అని. బాధ్యతలు గురించి షేర్ చేసుకునే సమయంలో ఇలా చేస్తే బాగుంటుంది అనే
పధ్దతిలో ముఖ్యమంత్రి చెబుతారు. చేసే ప్రోగ్రామ్ సిన్సియర్ గా చేస్తే ఉపయోగం
ఉంటుంది. చేయనందువల్ల మీకూ నష్టం జరుగుతుందని ఎక్స్ ప్లెయిన్ చేస్తున్నారు.
దీనిని ఇంకోరకంగా ఎలా ఎవరు చూడాలని ప్రయత్నం చేసినా అది దురుధ్దేశ్యంతో
చూసినట్లైనా అవుతుంది. లేదా తెలియనితనం అయినా అవుతుంది. వైయస్సార్ సిపి 175 కి
175 స్ధానాలు గెలుచుకోవడానికి తగిన విధంగా పనిచేయడం జరుగుతుంది. వేరే స్టేటజీ
ఏమీ లేదు. పబ్లిక్ లోకి పోవడం,వారితో మమేకం కావడం,ప్రతి ఇంటిని టచ్ చేయడం. ఆ
టచ్ చేయడం అనుకున్నట్లు జరగకపోతే ఇలా చేస్తే బాగుంటుందని వైయస్ జగన్ రివ్యూలో
ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలలో టికెట్ల కేటాయింపులో గడపగడపకు మన ప్రభుత్వం
ప్రోగ్రామ్ ప్రధాన క్రైటీరియా అవుతుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ గడపగడపకు మన
ప్రభుత్వం ఏ పర్పస్ కోసమైతే పెట్టారో ఇది పూర్తి అయితే రేటింగ్ ఆటోమేటిక్ గా
పెరుగుతుంది.మీరు ఒక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా అయితే
సెమిస్టర్ ఎగ్జామ్స్ చూసుకుంటారో అదే రీతిలో దాని ఇంపాక్ట్ ఫైనల్ ఫర్
ఫార్మేన్స్ లో ఉంటుంది.
శాసనసభ్యులుగా అన్ని ఇళ్ళకు వెళ్లగలిగితే అది ఖచ్చితంగా పాజిటివ్ గా
పనిచేస్తుంది. పాస్ అవుతారు.ఆ ఫర్ ఫార్మెన్స్ అందులో ఉంటే ఇది సర్వేలలో
రిఫ్లెక్ట్ అవుతుంది.ఆటోమెటిక్ గా అభ్యర్దిగా ఉంటారు. మంచి మెజారిటీతో విజయం
సాధిస్తారు. సైంటిఫిక్ మెధడ్ అంటున్నారు. అందరూ ఫాలో అవుతున్నారు. 175 కి 175
స్ధానాలు గెలివాలనే టార్గెట్ పెట్టారు.అందుకు అవసరమైన మైక్రో లెవల్ ప్లానింగ్
ఎట్లా అలాగే శాసనసభ్యులు ఏమి చేయాలి. పార్టీ అధ్యక్షులు ఏమి చేయాలి.
ముఖ్యమంత్రి తను చేయాల్సింది తాను చేస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సింది
చేస్తుంది కాబట్టి మిగిలిన లేయర్స్ అన్నీ ఎక్కడికక్కడ వారు చేయాల్సినవి
అనుకోవడంతోపాటు కీరోల్ ప్లే చేసే విధంగా జరుగుతుంది. రేపు ఎన్నికలలో,ప్రభుత్వం
ఫామ్ చేయడంలో గాని ముఖ్యమైన ఎంఎల్ ఏలకు సంబంధించి టెన్ ప్లేట్స్ డిసైడ్ చేయడం,
వారి వర్క్ డిసైడ్ చేయడం ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. మార్చి, ఏప్రిల్ నాటికి
సర్వే రిపోర్ట్స్ వస్తాయా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఏ పార్టీ అయినా వారి వారి
ఎన్నికల స్టేటజీస్ ఎలా ఉంటాయో దానికి ఫేస్ చేయడానికి అనుగుణంగా ఓటర్ల
బ్లెస్సింగ్ కోసం ఎప్పటినుంచి ఏం చేయాలో అవి చేస్తుండటంలో కంటిన్యూస్ గా
జరుగుతుంటాయి. సర్వేలకు సంబంధించి మార్చి, ఏప్రిల్, మేలలో రిపోర్ట్స్ వస్తూనే
ఉంటాయి. ఏ టైం లలో వాటిని బేస్ చేసుకుని అప్రాప్రియేట్ గా డెసిసన్
తీసుకోవాలనుకునేది పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయం
తీసుకుంటారు. ముందస్తు ఎన్నికలని చంద్రబాబు మాట్లాడటంపై ప్రశ్నించగా
తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడానికి చేస్తున్న ప్రచారంగా కొట్టిపడేశారు. మా
పార్టీ వైపునుంచి అలాంటి ఆలోచనలు చేయడం లేదన్నారు.