ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు శుభవార్త
తెలిపింది. పిల్లల్లో శారీరక దృఢత్వం కోసం జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన
పథకంలో పలు మార్పులు చేసింది.
మెనూ కార్డును మార్చింది. దీని వల్ల విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారం
లభిస్తుందని వివరించింది. ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు.. కొత్త మెనూ తయారు
చేసి, నేటి నుంచి అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యప్తంగా ప్రభుత్వ బడుల్లో
చుదువుకుంటున్న విద్యార్థులకు పోషక విలువలతో కూడిన “గోరుముద్ద” ను ప్రభుత్వం
వడ్డించనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం మిడ్ డే మీల్స్ డైరెక్టర్
ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినీ, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన
మెనూను పక్కాగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
తాజాగా మార్చిన మెనూ కార్డు వివరాలు..
సోమవారం.. హాట్ పొంగల్, ఉడికించిన కోడిగుడ్డు/కూరగాయల పులావ్, కోడిగుడ్డు కూర,
చిక్కీ
మంగళవారం.. చింతపండు/నిమ్మకాయ పులిహోర, టమాట/దొండకాయ పచ్చడి, ఉడికించిన
కోడిగుడ్డు
బుధవారం.. కూరగాయల అన్నం, బంగాళ దుంప కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
గురువారం.. సాంబార్ బాత్, ఉడికించిన కోడిగుడ్డు
శుక్రవారం.. అన్నం, ఆకు కూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
శనివారం.. ఆకుకూర అన్నం, పప్పు చారు, తీపి పొంగలి
గతంలో ఉన్న మోనూ కార్డు వివరాలు
సోమవారం.. అన్నం, పప్పు చారు, కోడి గుడ్డు కూర, చిక్కీ
మంగళవారం.. చింతపండు/నిమ్మకాయ పులిహోర, కోడిగుడ్డు/కూరగాయల పలావ్, ఉడికించిన
కోడిగుడ్డు, చిక్కీ
బుధవారం.. కూరగాయల అన్నం, బంగాళ దుంప కుర్మా, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
గురువారం.. కిచిడీ, టమాట పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు
శుక్రవారం.. అన్నం, ఆకు కూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, చిక్కీ
శనివారం.. ఆకుకూర అన్నం, సాంబార్, తీపి పొంగలి
అయితే పాత మెనూను తొలగించి విద్యార్థుల్లో దృఢత్వం కోసం ప్రభుత్వం కొత్తమెనూను
రూపొందించింది. అంతే కాకుండా నేటి నుంచే దాన్ని అమలు చేస్తోంది.