కేంద్ర ప్రభుత్వం వద్ద తనకున్న పట్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
మరోసారి నిరూపించుకున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన
నిధులు మంజూరు చేయించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తరహాలో కేంద్రంతో
ఘర్షణ వైఖరి అవలంబించకుండా.. ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తూ రాష్ట్ర
ప్రయోజనాల కోసం లౌక్యంగా వ్యవహరిస్తున్నారు.
పోలవరం..
రాష్ట్రానికి వరప్రదాయినిగా చెప్పుకుంటూన్న పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం
నుంచి నిధులను సమీకరించే ప్రయత్నాల్లో జగన్ ఉన్నారు. నిధుల మంజూరులో ఏర్పడిన
అడ్డంకులను అధిగమిస్తున్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణానికి
వ్యయం చేసిన వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెప్పించుకుంటున్నారు. ఈ విషయంలో
ఇప్పటికే పలుమార్లు వైఎస్ జగన్, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు.
మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి భారీగా నిధులు..
కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎం వైఎస్ జగన్‌కు శుభవార్త అందింది. మచిలీపట్నం
ఓడరేవు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి కేంద్రం అంగీకరించింది.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసింది. మొత్తంగా 3,940
కోట్ల రూపాయల మేర రుణాన్ని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసింది. ఈ
మొత్తాన్నంతటినీ మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి వ్యయం చేయాల్సి ఉంటుంది.
మళ్లీ అదే జిల్లాలో..
మచిలీపట్నం ఓడరేవు నిర్మాణాన్ని వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న
విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందట కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన బహిరంగ
సభలోనూ ఇదే విషయాన్నిఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి
అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. త్వరలోనే మరోసారి ఇదే
జిల్లాలో అడుగు పెడతానని హామీ ఇచ్చారు. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులకు
శంకుస్థాపన చేస్తానన్నారు. ఇప్పుడది వాస్తవ రూపాన్ని దాల్చబోతోంది. పవర్
ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం మంజూరైన నేపథ్యంలో ఇక జగన్ ప్రభుత్వం ఏ
మాత్రం జాప్యం చేయదలచుకోవాదం లేదు. మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి త్వరలోనే
శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు చేయనున్నారు. డిసెంబర్ మొదటి లేదా రెండో
వారంలో నిర్మాణ పనులకు శిలాఫలకం పడవచ్చుననే అంచనాలు అధికార వర్గాల్లో
వ్యక్తమౌతున్నాయి. హైకోర్టు సైతం ఈ పోర్ట్ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది.
రోడ్- రైల్ కనెక్టివిటీ..
పోర్ట్ నిర్మాణానికి అవసరమైన రోడ్ కనెక్టివిటీని కల్పించే దిశగా రోడ్లు-భవనాల
మంత్రిత్వ శాఖ అధికారులు అప్పుడే ప్రతిపాదనలను సైతం సిద్ధం చేస్తున్నట్లు
తెలుస్తోంది. రైలు, రోడ్ కనెక్టివిటీ కోసం ఎంత భూమిని సేకరించాలనే విషయమై
ఇదివరకే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రెడీ అయినట్లు చెబుతున్నారు. ఎంత
మేర భూమిని సమీకరించాల్సి ఉంటుందనే విషయం పై జిల్లా అధికారులు కసరత్తు
చేస్తున్నారు.