విజయవాడ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని ఆది నుంచి రైతులకు మద్దత్తుగా నిలిచిన
ప్రభుత్వమని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు.
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో వివిధ పంటల కొనుగోలు కోసం చేసిన ఖర్చు కంటే
మూడున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఖర్చు రెట్టింపు కన్నా
అధికం, ధాన్యం కొనుగోలు కోసం గత చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం కంటే
ఎక్కువగా జగన్ ప్రభుత్వం మూడేళ్లలోనే వెచ్చించింది. చంద్రబాబు ప్రభుత్వంలో
ఐదేళ్లలో పంటల కొనుగోలు కోసం పెట్టిన ఖర్చు రూ.3,322, సేకరించిన ధాన్యం రూ.
43134 కోట్లు కాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం మూడున్నరేళ్లలో పంటల
కొనుగోలు కోసం చేసిన ఖర్చు రూ.7,157 కోట్లు, మూడు సీజన్లలోనే సేకరించిన ధాన్యం
రూ.48,793 కోట్లు అని అన్నారు. నిజమైన రైతు ప్రభుత్వం ఎవరిదో ఈ గణాంకాలే
చెబుతున్నాయని అన్నారు.
సంక్షేమ హాస్టళ్లలో సకల వసతులు
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల రూపురేఖలు మార్చి, అత్యుత్తమ విద్యను అందించేలా
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విజయసాయి రెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగా రూ.3,364 కోట్లతో 3,013 సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల
ఆధునికీకరణకు నాడు-నేడు కార్యక్రమాన్ని చేపడుతోంది. హాస్టళ్లలో మౌలిక
సదుపాయాలతో పాటు కిచెన్లు ఆధునికీకరించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని
చేయాలని సీఎం జగన్ ఆదేశించారని తెలిపారు. ఫిర్యాదులకు ప్రత్యేకంగా ఒక నంబర్,
ఖాళీగా ఉన్న పోస్టులు యుద్దప్రాతిపదికన భర్తీకి ఆదేశాలు జారీ చేశారని
తెలిపారు.
అబద్దాలు, బుకాయింపుల్లో చంద్రబాబు సాటి లేరెవ్వరు
కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలనుకున్నానని చెబుతున్న చంద్రబాబు 14 ఏళ్లు
ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశాడని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. బుకాయింపులు,
అబద్దాలు చెప్పడంలో చంద్రబాబుకు వేరెవ్వరూ సాటిలేరని అన్నారు. చంద్రబాబుకు
మొదట్లోనే చంద్రగిరి ఛీ పొమ్మంది. ఆ తరవాత హైదరాబాద్ తన్ని తరిమింది. ఇంతకు
ముందే ఉత్తరాంధ్ర ఉమ్మేసింది. ఇప్పుడు రాయలసీమ కూడా గో బ్యాక్ అంటోందని
అన్నారు. అందరూ చీ కొట్టినా ఎల్లో కుల మీడియాలో బాబుకు కావాల్సినంత ప్లేస్
ఉందని అన్నారు.