నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
ప్రజాస్వామ్య పరరక్షణకు కృషి చేస్తా
జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార కమిషన్ ప్రధాన సమాచార
కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా
జ్ఞాపికను అందచేసిన గజల్ శ్రీనివాస్
సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం : ఏపీఎన్ఆర్ టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్
ఎస్ మేడపాటి
పంచ పాండవులే ఉత్సవాలకు సృష్టికర్తలు : గజల్ శ్రీనివాస్
తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఘనంగా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు
విజయవాడ : సాంస్కృతిక రంగానికి పునరుజ్జీవం రావాలని నగర మేయర్ రాయన
భాగ్యలక్ష్మి ఆకాంక్షించారు. సమాచార వ్యవస్థ ఆధునీకరణ తో ఉమ్మడి కుటుంబాలు
కనుమరుగై సెల్ ఫోన్లకు అతుక్కు పోతున్నారని, ఆ వూబి నుంచి బయట పడాలని
సూచించారు. సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలకు సంబంధించి జర్నలిస్ట్ మిత్రులు
ఇలాంటి కార్యక్రమానికి పూనుకోవడం అభినందనీయం అన్నారు. కవుల్ని, రచయితల్ని ఒక
గొప్ప సాహిత్య కళా వాతావరణంలోకి ఆహ్వానించేలా, కొత్త కవులు, కళాకారులను
ప్రోత్సహించేలా, పెద్దవారిని గౌరవించేలా ఆహ్లాదకరమైన సాంస్కృతిక వాతావరణ
పరిమళాల్ని నింపేలా ‘మల్లెతీగ’ సాహిత్య సేవాసంస్థ ‘జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’
నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడలో రెండురోజులపాటు తుమ్మల పల్లి కళా
క్షేత్రంలో ప్రారంభమైన జాతీయ సాంస్కృతిక ఉత్సవాలకు మేయర్ హాజరయ్యారు. ఈ
సందర్బంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళా రంగానికి పెద్ద పీట
వేస్తూ ఆ రంగానికి చెందిన వారికి అత్యున్నతమైన పదవులను ఇచ్చారని ప్రశంసించారు.

ప్రజాస్వామ్య పరరక్షణకు కృషి చేస్తానని ఆంధ్ర ప్రదేశ్ సమాచార కమిషన్ ప్రధాన
సమాచార కమిషనర్ ఆర్. మహబూబ్ బాషా అన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను
హాజరైన తొలి సభ ఇదేనని, అదే జర్నలిస్ట్ మిత్రులు నిర్వహించడం ఆనందంగా
ఉందన్నారు. ప్రధాన సమాచార కమిషనర్ గా తన పరిధిలో ప్రజలకు న్యాయం జరిగేలా
చూస్తానని స్పష్టం చేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తామని ఏపీఎన్ఆర్ టీ సొసైటీ
అధ్యక్షులు వెంకట్ ఎస్ మేడపాటి అన్నారు. మల్లె తీగ సహకారంతో అంతర్జాతీయ
స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఏపీఎన్ఆర్ టీ
సొసైటీ ద్వారా ముఖ్యమంత్రి పలు ప్రాంతాల ప్రజలకు సేవలను అందించేలా సహకారం
అందిస్తున్నారని చెప్పారు.

తెలుగు భాష , సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు ఐదుగురు జర్నలిస్టులు పంచ
పాండవుల్లా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని గజల్ శ్రీనివాస్
అన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, గజల్ ఫౌండేషన్ సహకారంతో భవిష్యత్తులో
మరిన్ని కార్యక్రమాలు చేడతామని ప్రకటించారు. ప్రసిద్ధ మానసిక వైద్య నిపుణులు
డాక్టర్ ఇండ్ల రామ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజయవాడ
పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాస రావు, గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్
ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్. ఆర్ గాంధీ నాగరాజన్, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్
ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జి. ఆంజనేయులు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు
నిమ్మరాజు చలపతి రావు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ ఛైర్మన్ మందపాటి
శేషగిరి రావు, విజయవాడ ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సుమ
వర్ష తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ తో పాటు డాక్టర్
రెంటాల శ్రీ వేంకటేశ్వర రావు, గజల్ కవులు సూరారం శంకర్, డి. రామ శర్మ, ఆత్మీయ
అతిథులు శ్యామల, విజయ గోలి, ప్రసిద్ధ ప్రజా వాగ్గేయకారులు , ఎమ్మెల్సీ
వెంకన్న, ఆంధ్ర ప్రదేశ్ అధికార బాషా సంఘం అధ్యక్షులు పి. వి విజయ్ బాబు,
సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ ఘంటా విజయ్ కుమార్, కమిటీ సభ్యులు, మల్లెతీగ
సాహిత్య సేవాసంస్థ అధ్యక్షుడు, ఆహ్వాన కమిటీ సభ్యులు కలిమిశ్రీ, ఇస్కా రాజేష్
బాబు, చొప్పా రాఘవేంద్ర శేఖర్, యేమినేని వెంకటరమణ, వల్లూరు ప్రసాద్ కుమార్
పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ రమణ యశస్వి గజల్ సంపుటి తేనె విందు ఆవిష్కరణ
జరిగింది. ప్రాంగణంలో ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితంగా చక్కెర, రక్తపోటు
పరీక్షలను నిర్వహించి మందులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన తెలుగు
కవులు, రచయితలు, ఇతర రాష్ట్రాల్లో నివసించే తెలుగు కళాకారులు, రచయితలు
పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరిగిన ఈ ఉత్సవాల్లో
‘సాహిత్యంలో వస్తున్న మార్పులపై చర్చలు, కొత్తతరం రచయితల కోసం
లబ్ధప్రతిష్టులైన రచయితలతో సాహిత్య శిక్షణా తరగతులు, కథ, కవిత, గజల్
ప్రక్రియలపై చర్చా కార్యక్రమాలు, మధుర గీతాలాపనలు, ఆయా
రంగాల్లో సేవ చేసిన కళాకారులకు, రచయితలకు సన్మానాలు, కవి సమ్మేళనాలు, కొత్త
పుస్తకావిష్కరణలు, కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. 20వ తేదీ ముగింపు సభకు ఆంధ్ర
ప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి,
సమాచార కమిషనర్ శామ్యూల్ జోనాథన్, తదితరులు పాల్గొంటారని వివరించారు.