జేబులో డబ్బులు లేకున్నా డిజిటల్ పేమెంట్…
ఏపీలో మందుబాబులకు శుభవార్త అందింది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ మద్యం
దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు. నవంబర్ 21 నుంచి
నగదు చెల్లింపులతో పాటు కార్డు స్వైపింగ్, యూపీఐ, క్యూఆర్ కోడ్ తదితర
చెల్లింపులు అనుమతించనున్నారు.
మద్యం అమ్మకాల ద్వారా వస్తున్న ఆదాయానికి స్థానికంగా షాపుల్లో ఉండే సిబ్బంది
చేతివాటాలతో గండి పడుతున్న నేపథ్యంలో డిజిటల్ చెల్లింపుల్ని పోత్సహించేందుకు
ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో వైపు మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అమలు
చేయడం లేదని విపక్షాలు సైతం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలక
నిర్ణయం తీసుకుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రైవేటు
వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాల్ని రద్దు చేసి వాటిని తమ అధీనంలోనికి
తెచ్చుకున్న సంగతి తెలిసిందే.