జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ
విజయవాడ : 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇవ్వడం భారతదేశానికి దశ దిశ నిర్దేశం చేసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ రాసిన భారత దేశానికి భగవద్గీత, కురాన్ , బైబిల్ లతో సమానమైన రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ పేర్కొన్నారు. దేశంలో సామాన్యులు ఎవరైనా అన్నిచోట్ల అన్యాయం జరిగితే చివరి స్థానంలో సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని (జరగని జరగకపోని) ఒక ఆశ. అటువంటి దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఉంటే ఇక న్యాయం గురించి మాట్లాడడం అసంబద్ధమైన విషయంగా గోచరించుచున్నది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు ప్రభుత్వాలు పెట్టే ఎన్నో ఎన్నెన్నో పథకాలలో కేవలం 5శాతం నుండి 10శాతం మాత్రమే నిజమైన లబ్ధిదారులకు చేరుతుంది మిగతా 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ లను అడ్డుపెట్టుకొని వారి పేర్ల మీద అగ్రవర్ణాల వారే (జంపు చేతుల వారు) అనుభవిస్తూ వస్తున్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరములు గడిచిన డాక్టర్ బి. ఆర్రాసిన రాజ్యాంగం అమలులో ఉన్నా కూడా ఇప్పటివరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు చిన్నచిన్న ఉద్యోగాలు, చిన్నచిన్న పదవులు తప్ప అత్యున్నత పదవులు కానీ, అత్యున్నత ఉద్యోగాలు కానీ రాలేదు అంటే కడుసోచనీయం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరములు అయినా కూడా ఇప్పటికీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ చూసిన ఏ కార్పొరేట్ కంపెనీలను చూసిన అగ్రవర్ణాల వారి ఆధీనంలోని కలవు ఇది చాలా చాలా విచారించవలసిన విషయము. ఇందుమూలంగా తెలియచేయడం ఏమనగా ఇప్పటికైనా భారత దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు భారతదేశం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని వారికి అన్యాయం జరగకుండా చూడాలని దేశాన్ని సమతులంగా చూడవలసిన బాధ్యత సుప్రీంకోర్టు ఇదేనని భావిస్తూ మరి ఒక్కసారి ఆలోచించిబీసీ, ఎస్సీ, ఎస్టీ ల భవిష్యత్ తరాల కోసం నిర్ణయాన్ని పున పరిశీలించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి.
న్యాయం తిరగబడింది : “కులం పేరుతో వివక్షకు గురైన వర్గాల వారికి సమప్రాతినిధ్యం దక్కించడం కోసమే రిజర్వేషన్ల వ్యవస్థ” అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4) & 16(4) లలో స్పష్టంగా పేర్కొనబడింది. మరి.. ఈ ఆర్థిక ప్రాతిపదిక ఎక్కడ నుండి వచ్చింది? ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాల్సినవి సంక్షేమ పథకాలు మాత్రమే. రిజర్వేషన్స్ కు ప్రాతిపదిక కులం (సామాజిక వెనుకబాటు) మాత్రమే. ఈ జమానాలో అంతటా ఉల్టా పల్టా అవుతుంది. ఓబీసీ వర్గాలలో చైతన్యం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీనివల్ల నష్టపోతోంది ఓబీసీ లే. ఇకనైనా మనకు సోయి వచ్చేనా?. మండల్ ఉద్యమానికి ఇదే సరైన సమయం. మండల్ కమీషన్ రిపోర్ట్ ప్రకారం ఓబీసీ ల జనాభా 54% ..అగ్రకులాల జనాభా ఎంత అనేది తెలియకుండా వారికి 10 శాతం రిజర్వేషన్లా?. అసలు ఏలెక్కల ప్రకారం 10% కేటాయించారు అనే దానిపై చర్చ జరిగినట్టు లేదు.
తీర్పు వెలువరించే ముందు OC ల జనాభాను సుప్రీ పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు…(శాస్త్రీయ లెక్కలు లేవు). ఇలాంటి సమస్యలకు మండల్ 2 బీసీల ఉద్యమమే సరైన సమాధానం. రిజర్వేషన్లు 50 శాతం దాటొచ్చు అన్న సుప్రీ తీర్పును మనకు అనుకూలంగా మలచుకొని జనాభా దామాషా ప్రకారం ఓబీసీ లకు 54%రిజర్వేషన్ల కోసం పోరాడాలి. సమగ్రంగా, శాస్త్రీయంగా అన్ని కులాల లెక్కలు తీయాలి. జనాభా దామాషా ప్రకారం (రిజర్వేషన్లు) ప్రాతినిధ్యం కల్పించాలి. వేరే అంశాలు పక్కన పెట్టాలి. మండల్ మహనీయుడే మనకు మార్గదర్శి. ఇదే అంశంపై దేశవ్యాప్త చర్చజరగాలి. రిజర్వేషన్లు 50% దాటొచ్చు అన్న సుప్రీం తీర్పు ప్రకారం ఓబీసీ లకు 54% రిజర్వేషన్లు అమలు చేయాలి. లేదా సమగ్రమైన,శాస్త్రీయమైన కులగణన ద్వారా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలి. 1931 జనాభా లెక్కల ప్రకారం ఓబీసీ ల జనాభా 54% గా మండల్ కమిషన్ పేర్కొంది. ఇప్పుడు ఆ శాతం మరింత పెరుగుతుంది. ఎందుకంటే 1931 తర్వాత దేశవ్యాప్తంగా చాలా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చారు. దళిత క్రిస్టియన్లు ఇప్పుడు అప్పటికంటే ఎక్కువయ్యారు. వారు కూడా ఓబీసీ కోటాలోకే వస్తారు. ఇప్పుడు లెక్కలు తీస్తే ఓబీసీ జనాభా 60 శాతం దాటొచ్చు. దానికనుగుణంగా అన్ని రంగాలలో ప్రాతినిధ్యం పెరగాలి. 10 మంది బీసీ లు పోగైన ప్రతి చోట ఈ డబ్ల్యూ ఎస్ తీర్పు పై చర్చించాలి.
అందరూ ఒకే వేదికపైకి రావాలి : చారిత్రాత్మకమైన తప్పిదాలకు మనము అవకాశం ఇవ్వొద్దు. మన భవిష్యత్తు తరాలు మనల్ని నిందించకూడదు. ఈ ఉద్యమం సోషల్ మీడియాలో స్పందకు మాత్రమే పరిమితం కాకూడదు. మండల్ ఉద్యమమంటే ఒక రోజు భారీగా జనసమీకరణ చేసి ఆ తరువాత వదిలేసి కాదు. ఓబీసీ ల దీర్ఘకాలిక ప్రయోజనాల సాధన కోసం సాధించేవరకు పోరాడాలి. రైతు ఉద్యమాన్ని స్ఫూర్తి గా తీసుకోవాలి.
రాజకీయాలకు అతీతంగా పోరాడాలి. ఎలాంటి భేషజాలు అవకాశం ఇవ్వకూడదు. ఏ సుప్రీమ్ కోర్టు ఐతే ఓబీసీ రిజర్వేషన్ల సమయం లో 50% రిజర్వేషన్లు దాటకూడదని పరిమితి విధించిందో అదే కోర్టు ఆ పరిమితి ని సడలించి రిజర్వేషన్ల పరిమితి పెంచింది. ఇప్పుడు మనం 27 శాతాన్ని 52% శాతం కు పెంచమని న్యాపరమైన పోరాటం చేయాలి. రాజకీయ పరమైన పోరాటానికి కూడా సిద్ధం కావాలి. మండల్ ఉద్యమానికి సిద్ధం అవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మడిమాండ్ చేశారు.