డక్కిలి వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ :రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచనల మేరకు ఎన్నికల విధులకు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజుటి వరకు దరఖాస్తు చేయనివారు 122- వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ ప్రభుత్వ ఓటర్లు తమ ఓటును వినియోగించుకొనుటకు 122- రిటర్నింగ్ అధికారి కార్యాలయం ( మున్సిపల్ కార్యాలయం ) వెంకటగిరి నందు ఏర్పాటు చేయబడిన ఫెసిలిటేషన్ కేంద్రం నందు వారి యొక్క విధుల ఉత్తరువు మరియు గుర్తింపు కార్డు తో వచ్చి తమ ఓటును డక్కిలి మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవాలని 7వ తారీకు మరియు ఎనిమిదో తారీఖు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటున్నట్లు డక్కిలి మండల తహిసిల్దార్ ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటన తెలియజేశారు.