జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం విచ్చేసిన ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ శ్రీ కొణిదెల వరుణ్ తేజ్ గారికి శనివారం రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చిరంజీవి యువత అభిమాన సంఘాల నాయకులు శ్రీ ధర్మేంద్ర, శ్రీ బాబీ ఏడిద నేతృత్వంలో అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. శ్రీ వరుణ్ తేజ్ గారు గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలు పెట్టి వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారు. ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్ షో, సమావేశాల్లో పాల్గొని ప్రసంగిస్తారు.